Pawan Kalyan: ‘బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందాం’.. భోగి వేడుకల్లో పవన్..

సంక్రాంతి సందర్భంగా రాజధాని నగరంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆ తరువాత ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరితో పాటు.. ఐదు కోట్ల ప్రజల రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులను లాఠీలతో కొట్టి బాధలకు గురి చేశారని.. రైతుల ఆవేదన, ఏడుపు తనను కలిచి వేసిందిందన్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan: బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందాం.. భోగి వేడుకల్లో పవన్..
Pawan Kalyan

Updated on: Jan 14, 2024 | 1:26 PM

సంక్రాంతి సందర్భంగా రాజధాని నగరంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆ తరువాత ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరితో పాటు.. ఐదు కోట్ల ప్రజల రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులను లాఠీలతో కొట్టి బాధలకు గురి చేశారని.. రైతుల ఆవేదన, ఏడుపు తనను కలిచి వేసిందిందన్నారు పవన్ కళ్యాణ్. అందుకే టీడీపీ-జనసేన కలసి ఉన్నాయన్నారు. మీకిచ్చిన మాట నెరవేర్చేలా ముందుకెళ్తామన్నారు.

బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందాం అని తెలిపారు. జై అమరావతి అన్నప్పుడల్లా.. జై ఆంధ్రా నినాదాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇది అమరావతి సమస్య కాదు.. ఐదు కోట్ల ప్రజలందరకి సమస్య అని ప్రజలందరికీ తెలియాలన్నారు. రేపు శ్రీకాకుళం, పులివెందులలో కూడా ఇదే సమస్య వస్తుందన్నారు. రైతులకు కౌలు రాని సమయంలో జనసేన ముందుకొచ్చి పోరాడిందని గుర్తు చేశారు. ముళ్ల కంచెలు దాటి ముందుకు వచ్చాం.. మరోసారి వైసీపీ వస్తే చీకటి భవిష్యత్తు ఖాయమని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..