‘జగనన్న తోడు పధకం’.. రూ. 10 వేలు రానివారికి మరో అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వం.!

|

Nov 25, 2020 | 5:08 PM

జగనన్న తోడు పధకం ద్వారా అర్హత ఉండి కూడా లబ్ది పొందలేని చిరు వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

‘జగనన్న తోడు పధకం’.. రూ. 10 వేలు రానివారికి మరో అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వం.!
Follow us on

Jagananna Thodu Scheme: జగనన్న తోడు పధకం ద్వారా అర్హత ఉండి కూడా లబ్ది పొందలేని చిరు వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే అర్హుల జాబితాను సంబంధిత సచివాలయాల్లో ప్రదర్శించామని.. ఆ జాబితాలో పేర్లు నమోదు కానివారు తమ సమీప గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. అలాగే సహాయం, ఫిర్యాదుల కోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌‌కు కాల్ చేయాలని సూచించింది.

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి లబ్ది చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల అప్లికేషన్‌ను నెల రోజుల్లో పరిశీలించి.. వారు అర్హులై ఉంటే వెంటనే వారికి కూడా వడ్డీ లేని రుణాలు అందుతాయంది. కాగా, చిరు వ్యాపారులకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు ఇవాళ జగనన్న తోడు పధకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి: ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..