Grama Volunteers: వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఉగాది రోజున సత్కారం..

|

Apr 01, 2021 | 4:45 PM

Jagan Government Good News: గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఉగాది రోజున వారిని సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...

Grama Volunteers: వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఉగాది రోజున సత్కారం..
YS Jagan
Follow us on

Jagan Government Good News: గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఉగాది రోజున వారిని సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పేరిట మూడు కేటగిరీలుగా అవార్డులతో గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించనుంది. సేవావజ్రకు రూ. 30 వేలు, సేవారత్నకు రూ. 20 వేలు, సేవామిత్రకు రూ. 10 వేలు నగదు పురస్కారం, శాలువాతో సత్కరించనుంది. విపత్కర పరిస్థితుల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను అందించనుంది. ఈ నెల 13వ తేదీన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది.

మున్సిపల్ పదవుల్లో మహిళలే అధిక భాగం…

కార్పొరేషన్, మున్సిపల్ పదవుల్లో మహిళలకే పెద్ద పీట వేసినట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులను కేటాయించినట్లుగా ఆయన పేర్కొన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న సీఎం.. అందుకోసం ప్రతీ వార్డుకు రెండేసి చొప్పున 8 వేల వాహనాలను కేటాయించినట్లుగా పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ వెల్లడించారు.

Also Read:

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!

అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!