Andhra Pradesh: సీఎం జగన్ చూపు అటువైపే.. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన..?

|

Feb 26, 2023 | 9:08 PM

ఉగాది నుంచి విశాఖనే ఏపీకి రాజధాని కాబోతుందా? విశాఖలో సీఎం ఉండేందుకు నివాస భవనం సిద్ధమైందా? సీఎం ఒకవేళ విశాఖకు వస్తే అమరావతిలో అడుగుపెట్టరా? లేదంటే కొన్ని రోజులు విశాఖలో, మరికొన్ని రోజులు అమరావతిలో ఉంటారా? ఒక రాజధాని, వంద అనుమానాలపై ఇప్పుడు సరికొత్త ప్రచారం మొదలైంది..

Andhra Pradesh: సీఎం జగన్ చూపు అటువైపే.. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన..?
Follow us on

వచ్చే నెలలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో ఇప్పుడు ఏపీ ఫోకస్ అంతా విశాఖపైనే ఉంది. దీని తర్వాత ఉగాది నుంచి విశాఖనే ఏపీకి రాజధాని కాబోతుందా? విశాఖలో సీఎం ఉండేందుకు నివాస భవనం సిద్ధమైందా? సీఎం ఒకవేళ విశాఖకు వస్తే అమరావతిలో అడుగుపెట్టరా? లేదంటే కొన్ని రోజులు విశాఖలో, మరికొన్ని రోజులు అమరావతిలో ఉంటారా? ఒక రాజధాని, వంద అనుమానాలపై ఇప్పుడు సరికొత్త ప్రచారం మొదలైంది.. అదేంటో ఈ స్టోరీ చదివేయండి..

సీఎం జగన్‌.. విశాఖకు రావడం ఖాయం అట. అయితే ఆయన వారానికి 2 రోజులు మాత్రమే విశాఖలో ఉండబోతున్నారట. సోమవారం ఉదయం వచ్చి సోమ, మంగళవారాలు విశాఖలో బస చేయనున్నారట. ఈ రెండు రోజులు విశాఖ నుంచే పరిపాలన ఉండబోతుందనేది అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం. అధికారులతో సమీక్షలు, అధికారిక సమావేశాలు ఇక్కడ నుంచే జరగబోతున్నాయట.

బుధవారం ఉదయం రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో గ్రామ పర్యటనకు వెళ్లాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతీ బుధవారం ఎంపిక చేసిన గ్రామానికి వెళ్లి రాత్రికి అక్కడే పల్లె నిద్ర చేస్తారట. మళ్లీ ఉదయాన్నే అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి గురువారం అక్కడ నుంచి అమరావతి వెళ్తారట. శుక్ర, శని, ఆదివారాలు సీఎం జగన్ అమరావతిలో ఉండబోతున్నారు. శుక్రవారం అధికారిక సమావేశాల అనంతరం అవసరమైతే వీకెండ్‌లో అక్కడ నుంచే జిల్లాల పర్యటన చేస్తారట.

ఇవి కూడా చదవండి

విశాఖలో రాజధానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చి, అవసరమైన భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు షెడ్యూల్ ఇలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రిషికొండలో నిర్మితం అవుతున్న అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీస్ పూర్తయ్యే వరకు విశాఖలో హార్బర్ పార్క్ పేరుతో ఉన్న విశాఖ పోర్ట్ గెస్ట్ హౌజ్‌లో సీఎం జగన్ బస చేయబోతున్నారట. సువిశాలమైన వాతావరణంలో ఏర్పాటు చేసి ఉన్న ఈ గెస్ట్ హౌజ్‌లో ఒక వీఐపీ సూట్‌తో పాటు కొన్ని మిని సూట్లు, వీఐపి రూమ్స్ ఉన్నాయి. చుట్టూ పచ్చదనం నిండి ఉండి అవసరమైన పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది.

భద్రత పరంగాను ఇది వ్యూహాత్మకమైన ప్రాంతం అన్నది అధికారుల అంచనా. పోర్ట్ భద్రతను పర్యవేక్షించే CISF బలగాల పర్యవేక్షణలో ఈ గెస్ట్ హౌజ్ ఉంటుంది. కేవలం కిలోమీటర్ దూరంలో బస్తాండ్, రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి, 15 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్ట్ ఉంటుంది. అన్ని విధాల అనువైన ప్రాంతంగా దీన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఉగాది తర్వాత విశాఖ నుంచే పరిపాలన అన్న దానిపై అధికార వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..