AP DGP: ఏపీకి త్వరలో కొత్త డీజీపీ..! రేసులో ఎవరెవరు ఉన్నారంటే..

|

Dec 10, 2024 | 7:28 PM

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకావం ముమ్మరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు సర్వీస్ ఈ నెల చివరి నాటికి ముగియనుంది. అయితే ఆయన సర్వీస్ పొడిగింపు ఉంటుందా? లేదా? అనే దానిపేఐ క్లారిటీ లేదు. ఒకవేళ రిటైర్ మెంట్ తీసుకుంటే తర్వాత ఆ పోస్టులో ఎవరుంటారనే దానిపై చర్చసాగుతుంది..

AP DGP: ఏపీకి త్వరలో కొత్త డీజీపీ..! రేసులో ఎవరెవరు ఉన్నారంటే..
AP DGP
Follow us on

అమరావతి, డిసెంబర్‌ 10: కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగించేవారు కానీ డీజీపీ పదవి కాలాన్ని పొడిగించిన సందర్భాలు మాత్రం లేవు. ఈ క్రమంలో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తారా? మరొకరికి ఛాన్స్‌ ఇస్తారా? అన్నది త్వరలో తెలియనుంది. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ డేట్ పై సీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ ద్వారకా తిరుమలరావు. ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించింది. నిజానికి ఆయన సీనియార్టీలో టాప్ టెన్ లో లేరు.

కానీ నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి, మనోజ్ అనుకుని ఆయనను అందలం ఎక్కించారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియర్టీలో మొదటిస్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు ఛాన్స్‌ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తరవాత కొన్నాళ్లు గుప్తానే డీజీపీగా ఉన్నారు. కానీ తర్వాత ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్‌ ఇచ్చారు. చంద్రబాబు డీజీపీ విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తారని, సీనియార్టీకి గౌరవం ఇస్తారని, అదేసమయంలో సమర్ధత కూడా చూస్తారని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. సీనియార్టీ ఉన్నా అంచనాలకు అనుగుణంగా పని చేస్తారని అనుకోకపోతే పదవి ఇవ్వరని కూడా అనుకుంటున్నారు.

అందువల్లనే ద్వారకా తిరుమలరావు తర్వాత మళ్లీ హరీష్ గుప్తాకే డీజీపీగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎవరు డీజీపీగా ఉన్నా వైసీపీ హాయాంలో సవాంగ్, రాజేంద్రనాథ్ రెడ్డి తరహాలో విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం మాత్రం ఉండదని గుర్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.