Andhra Pradesh: త్వరలో ఏపీలో ప్రారంభం కానున్న ఇంటర్ క్లాసులు.. విద్యా క్యాలెండర్ రిలీజ్

|

May 31, 2022 | 9:51 AM

ఇంటర్ బోర్డు మొత్తం 295 రోజులు సంబంధించిన క్యాలెండర్ ను ప్రకటించింది. ఇందులో కాలేజీ వర్కింగ్ 220 ఉండగా.. 75 రోజులు హాలీడేవ్ ఉన్నాయి. ఈ సెలవుల్లో దసరా, సంక్రాంతి, జాతీయ సెలవులు కూడా ఉన్నాయి.

Andhra Pradesh: త్వరలో ఏపీలో ప్రారంభం కానున్న ఇంటర్ క్లాసులు.. విద్యా క్యాలెండర్ రిలీజ్
Ap Student Inter
Follow us on

Andhra Pradesh: ఆంధ్రపదేశ్ లోని 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఏపీలో ఇంటర్ జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రాంరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ కాలేజీలు త్వరలో స్టూడెంట్స్ కోసం అడ్మిషన్లను ప్రారంభించనుంది. ఇక ఇంటర్ బోర్డు  మొత్తం  295 రోజులు సంబంధించిన క్యాలెండర్ ను ప్రకటించింది. ఇందులో కాలేజీ వర్కింగ్  220 ఉండగా..  75 రోజులు హాలీడేవ్ ఉన్నాయి. ఈ సెలవుల్లో దసరా, సంక్రాంతి, జాతీయ సెలవులు కూడా ఉన్నాయి.

ఇక 2022-2023 ఏప్రిల్‌ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 22 నుంచి  మే 31 వరకు కాలేజీలకు వేసవి సెలవులు ఉండనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి జూన్ 1, 2023న మళ్లీ కాలేజీలు రీ ఓపెన్ చేస్తారు.  ఇంటర్నీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్విహించాలని ఇప్పటికే ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ తాము ఎంపిక చేసుకున్న సదరు కాలేజీలను అడిషన్ల కోసం సంప్రదించాల్సి ఉంటుంది.

Ap Inter Classesఅయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖలో త్వరలో ఇంటర్మీడియట్‌ విలీనం కానుంది. ఈ మేరకు  ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో ఏపీ ఇంటర్‌ బోర్డు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..