నోరు లేని జీవిపై నరరూప రాక్షసుల వికృత చేష్ట.. రక్తపు మడుగులో ‘రైతు బిడ్డ’..!

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానిక రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనుషుల మధ్య ఉండాల్సిన కక్షలను అమాయకపు మూగజీవిపై చూపించి, తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నోరు లేని జీవిపై నరరూప రాక్షసుల వికృత చేష్ట..  రక్తపు మడుగులో రైతు బిడ్డ..!
Brutality Inflicted Upon A Ox

Updated on: May 21, 2026 | 8:18 AM

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానిక రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనుషుల మధ్య ఉండాల్సిన కక్షలను అమాయకపు మూగజీవిపై చూపించి, తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కోసిగి మండలం కేంద్రానికి చెందిన రైతు నాగరాజుకు చెందిన సుమారు లక్ష రూపాయల విలువైన ఎద్దుపై దుండగులు వేటకొడవలితో కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో ఎద్దు తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మూగజీవిని చూసి రైతు నాగరాజు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పశువైద్యులు వెంటనే అక్కడికి చేరుకొని, తీవ్రమైన గాయాలకు కుట్లు వేసి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఎద్దు కోలుకుంటోంది. తన జీవనాధారమైన ఎద్దుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నాగరాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. “మనుషుల మధ్య గొడవలు ఉంటే నేరుగా తేల్చుకోవాలి కానీ, నోరు లేని జీవాల మీద ఇలాంటి ప్రతాపం చూపడం పిరికిపంద చర్య,” అని స్థానిక రైతులు మండిపడుతున్నారు.

నిందితులను త్వరగా గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోసిగి రైతాంగం డిమాండ్ చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడ్డ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us