CM Jagan: సీఎం జగన్ ను కలిసిన అండర్-19 వైస్ కెప్టెన్.. ప్రోత్సాహకాలు అందజేత

|

Feb 16, 2022 | 7:44 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్(ap cm jagan) రెడ్డిని.. భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌(Rasheed) కలిశారు. ఈ మేరకు షేక్‌ రషీద్‌ను సీఎం..

CM Jagan: సీఎం జగన్ ను కలిసిన అండర్-19 వైస్ కెప్టెన్.. ప్రోత్సాహకాలు అందజేత
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్(ap cm jagan) రెడ్డిని.. భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌(Rasheed) కలిశారు. ఈ మేరకు షేక్‌ రషీద్‌ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు, రూ.10 లక్షలు నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయించారు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ హమీ ఇచ్చారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును రషీద్ కు సీఎం అందజేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన షేక్ రషీద్.. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించి సత్తా చాటాడు. టీమిండియా యువ జట్టు ఆసియా కప్‌ గెలవడంలోనూ, అండర్‌ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలోనూ కీలకపాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్‌ తండ్రి బాలీషా, ద ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు, శాప్‌ అధికారులు పాల్గొన్నారు.

రషీద్ తండ్రి బ్యాంక్ ఉద్యోగి. ఏడేళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన రషీద్.. తొమ్మిదేళ్లకే అండర్-14లో అడుగు పెట్టాడు. అంతర్ జిల్లాల పోటీల్లో 12 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్-16 టోర్నీలో సత్తా చాటి, భారత అండర్-19 వరల్డ్ కప్‌ కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ లో ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. తన కొడుకు మంచి క్రికెటర్ కావాలనేది తన కోరిక అని రషీద్ తండ్రి తండ్రి బాలీషా వలీ అన్నారు. తాను టీమిండియాకు ఆడాలని అనుకునేవాడినని.. అయితే తనకున్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదన్నారు. తన కొడుకు ద్వారా తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నానని బాలీషా వలీ చెప్పారు.

Also Read

Shocking Video: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి..! షాక్‌ తిన్న వైద్యులు..! వైరల్ అవుతున్న వీడియో..

AP Crime: ఉసురు తీసిన అప్పులు.. గడ్డి మందు తాగిన దంపతులు.. భర్త మృతి

Sai pallavi vs Teddy Bears: నేచురల్ బ్యూటీ ‘సాయి పల్లవి’తో పోటీ పడుతున్న ‘టెడ్డీ బేర్స్’.! కలర్స్‌లో తగ్గేదే లే.. వైరల్ అవుతున్న ఫొటోస్..