Andhra Pradesh: టీవీ9 వరుస కథనాల ఎఫెక్ట్.. కార్డేలియా క్రూయిజ్‌కు తీరిన పార్కింగ్‌ కష్టాలు..

|

Jul 14, 2022 | 7:46 AM

Andhra Pradesh: కార్డేలియా క్రూయిజ్‌ షిప్ పార్కింగ్‌ వివాదానికి తెరపడింది. టీవీ9 వరుస కథనాలతో విశాఖ పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ యాక్షన్‌లోకి దిగింది.

Andhra Pradesh: టీవీ9 వరుస కథనాల ఎఫెక్ట్.. కార్డేలియా క్రూయిజ్‌కు తీరిన పార్కింగ్‌ కష్టాలు..
Ship
Follow us on

Andhra Pradesh: కార్డేలియా క్రూయిజ్‌ షిప్ పార్కింగ్‌ వివాదానికి తెరపడింది. టీవీ9 వరుస కథనాలతో విశాఖ పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ యాక్షన్‌లోకి దిగింది. కార్డేలియా క్రూయిజ్‌ షిప్ పార్కింగ్‌ వివాదంతో టూరిస్టులు పడుతోన్న ఇబ్బందులను టీవీ9 వెలుగులోకి తేవడంతో పోర్ట్‌ అధికారులు స్పందించారు. క్రూయిజ్‌ పర్యాటకులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టింది. విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌లో EQ-1 పార్కింగ్‌ బెర్త్‌ని కేటాయించింది పోర్ట్ యాజమాన్యం. టూరిస్టులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు పోర్ట్‌ ఛైర్మన్‌. కేటాయించిన EQ-1 పార్కింగ్‌ బెర్త్‌ నుంచి చెన్నైకు బయల్దేరింది కార్డేలియా క్రూయిజ్‌ షిప్‌.

విశాఖ-చెన్నై మధ్య నడుస్తోన్న కార్డేలియా క్రూయిజ్‌ షిప్ పార్కింగ్‌పై వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. మంచి ఆదరణ పొందుతున్న క్రూయిజ్‌కు పార్కింగ్‌ సమస్య ఏర్పడటంతో ఇబ్బందులు పడ్డారు పర్యాటకులు. పోర్ట్‌ ట్రస్ట్‌లో పార్కింగ్‌ సౌకర్యం లభించకపోవడంతో కంటైనర్‌ టెర్మినల్‌ నుంచి రాకపోకలు సాగిస్తూ వచ్చింది క్రూయిజ్‌ షిప్. కంటైనర్‌ టెర్మినల్‌లో పార్కింగ్‌తో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. క్రూయిజ్ ప్రయాణం అద్భుంగా ఉన్నప్పటికీ, విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ వరకు షిప్‌ రాకపోవడంతో అవస్థలు పడేవారు టూరిస్టులు. క్రూయిజ్‌ పార్కింగ్‌ వివాదం, పర్యాటకుల ఇక్కట్లపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో సమస్యపై దృష్టిపెట్టింది పోర్ట్‌ యాజమాన్యం. చివరికి, విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌లో Q-1 పార్కింగ్‌ బెర్త్‌ని కేటాయించడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు టూరిస్టులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..