Andhra Pradesh: పత్తి రైతులకు మార్కెట్ షాక్.. భారీగా పడిపోయిన ధరలు..

|

Jun 30, 2022 | 8:58 AM

Andhra Pradesh: పత్తి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పత్తి ధరలు భారీగా పడిపోయాయి. ఆదోని మార్కెట్‌లో రైతులు లబోదిబోమన్నారు.

Andhra Pradesh: పత్తి రైతులకు మార్కెట్ షాక్.. భారీగా పడిపోయిన ధరలు..
Cotton Price
Follow us on

Andhra Pradesh: పత్తి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పత్తి ధరలు భారీగా పడిపోయాయి. ఆదోని మార్కెట్‌లో రైతులు లబోదిబోమన్నారు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర భారీగా పతనమైంది. గత నెలవరకు రైతులకు సిరులు కురిపించిన తెల్లబంగారం.. దేశంలోనే ఆదోని మార్కెట్‌లో రికార్డ్ స్థాయి పలికింది. 12,900 రూపాయలు ఉన్న పత్తి ధర సెడన్‌గా అమాంతం 9,706 రూపాయలకు పడిపోయింది. రానున్న రోజుల్లో మరింత రేటు పలుకుందని ఆశించిన రైతులకు తాజా పత్తి ధర తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒక్కసారిగి 3,200 రూపాయలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీజన్ ముగియడంతో ఇళ్లల్లో నిల్వ ఉంచిన పత్తిని రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే, మంచి రేటు పలుకుతుందని ఆశించి రైతులకు.. మార్కెట్‌లో షాక్ తగిలిగింది. తాజా ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమల్లో ఉత్పత్తికి అవసరమైన పత్తి దొరకకపోవడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే ఇప్పుడు పత్తి రేటు అమాంతం పడిపోవడంపై వ్యాపారులు వివరణ ఇచ్చారు. గతనెల రోజుల నుంచి మార్కెట్ కు వస్తున్న పత్తి నాణ్యత లోపించంతో ధరలు పడిపోయాయని చెప్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది. వచ్చిన కొద్దిపాటికి పత్తికి నెల క్రితం అధిక ధర లభించడంతో రైతుల్లో కొంత ఊరట కనిపించింది. లాభాలు రాకపోయినా నష్టాలు కొంతయినా తగ్గించుకోవచ్చని భావించారు. సెడన్ గా ధరలు బాగా తగ్గిపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు పత్తి రైతులు.