Andhra Pradesh: తాడిపత్రిలో మళ్లీ రాజుకున్న రాజకీయ మంటలు.. ఎమ్మెల్యేపై జేసీ హాట్ కామెంట్స్..

|

May 21, 2022 | 8:36 AM

Andhra Pradesh: తాడిపత్రిలో మరోసారి రాజకీయ సెగ రేగింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్‌ మొదలైంది.

Andhra Pradesh: తాడిపత్రిలో మళ్లీ రాజుకున్న రాజకీయ మంటలు.. ఎమ్మెల్యేపై జేసీ హాట్ కామెంట్స్..
Peddareddy Vs Jc
Follow us on

Andhra Pradesh: తాడిపత్రిలో మరోసారి రాజకీయ సెగ రేగింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్‌ మొదలైంది. పెద్దారెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు ప్రభాకర్‌రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దీక్షకు దిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. దిండు దుప్పటి సహా వచ్చి, అనంతపురం రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ ముందు కూర్చున్నారు. ఎలాంటి పర్మిషన్స్‌ తీసుకోకుండా తాడిపత్రి మున్సిపాలిటీలో చేపడుతోన్న అక్రమ నిర్మాణాలను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

తాము ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్‌ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. MLA పెద్దారెడ్డి, తన బంధువుల ఆస్తులకు నష్టం జరగకుండా డ్రైనేజీని కుదించి కట్టిస్తున్నారని, దీన్ని ఆపకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రభాకర్‌రెడ్డి. టీడీపీ కౌన్సిలర్లతో కలిసి ప్రభాకర్‌రెడ్డి ఆందోళనకు దిగడంతో అధికారులు హైరానా పడ్డారు. అక్రమ నిర్మాణాలను ఆపేవరకు కదిలేదని భీష్మించుకుని కూర్చోవడంతో రోజంతా టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.