AP Weather: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రిపోర్ట్.. ఇదిగో ఈ ప్రాంతాల్లో వర్షాలు

|

Sep 05, 2024 | 2:48 PM

ఏపీకి మరో గండం వచ్చేసింది.. నిన్నా మొన్నటి భారీ వర్షాలు, వరదలకు విజయవాడ మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న విజయవాడపై మరో పిడుగు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

AP Weather: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రిపోర్ట్.. ఇదిగో ఈ ప్రాంతాల్లో వర్షాలు
Weather Update
Follow us on

బుధవారం నాటి పశ్చిమ మధ్య,  వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావముతో గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సరిహద్దు వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ -దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధం ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 ఎత్తు లో కి.మీ ఎగువన విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతిదిశ వైపు వంగి ఉంటుంది. ఇది వచ్చే 2 రోజుల్లో ఉత్తరం దిశ వైపు నెమ్మదిగా కదులుతుంది.

సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు సూరత్‌గఢ్, రోహ్‌తక్, ఒరై, మాండ్లా మీదుగా ఆనుకుని పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల్లో వున్న అల్పపీడన కేంద్రం నుండి ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి వుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

గురువారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

 

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

గురువారం, శుక్రవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.  ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

————————————–

గురువారం, శుక్రవారం:-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..