
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా.. మళ్లీ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా.. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దాంతో.. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక.. ఏపీకి వాయుగుండం ప్రభావం తప్పినప్పటికీ.. పలు జిల్లాల్లో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు.. కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..