రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు రత్నగిరి, షోలాపూర్, మెదక్, భద్రాచలం, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతుంది. రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి, మహారాష్ట్రలోని మరికొన్ని భాగాలు (ముంబయితో సహా), తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లోని మిగిలిన భాగాలు, దక్షిణ ఛత్తీస్‌గఢ్ & దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతములోని మరిన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలలోకి వ్యాపించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉత్తర రాయలసీమ & పరిసర ప్రాంతాలపై గల సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల అవర్తనము ఇప్పుడు దక్షిణ తెలంగాణ & పొరుగు ప్రాంతం పై కొనసాగుతున్నది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్యగల గాలి కోత ఇప్పుడు దాదాపు 16°N వెంబడి నడుస్తుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————
శుక్రవారం, శనివారం, ఆదివారం :-తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
శుక్రవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
శనివారం, ఆదివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
రాయలసీమ :-
—————-
శుక్రవారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
శనివారం, ఆదివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..