Weather Update: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. సోమవారం వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

AP, Telangana Weather Update: వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల రైతన్నలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. అలాగే వర్షాల సమయంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల పట్ల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Weather Update: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. సోమవారం వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Ap, Telangana Weather Update

Updated on: Jul 20, 2026 | 6:55 AM

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలలో ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం

మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అయితే గురువారం వరకు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపారు. అలాగే వర్షం సమయంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో వాతావరణం ఇలా 

ఇటు తెలంగాణలో సైతం సోమవారం భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది.

ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షం సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని.. ఎక్కడైనా కరెంట్ స్తంభాలు విరిగిపడితే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us