Dussehra 2021: ఇదేం పాడుపని.. ఉత్సవాల పేరుతో దుర్గమ్మ ఆలయం ముందు అశ్లీల నృత్యాలు..

|

Oct 11, 2021 | 7:56 AM

Navaratri 2021: దేవీ నవరాత్రులు అంటే సాధారణంగా ప్రజలు భక్తి ప్రపత్తులతో, ఎంతో నిష్టంగా ఉంటారు. ఉదయాన్నే లేచి స్నానమాచరించి ఆధ్యాత్మిక చింతనలో అమ్మవారికి పూజలు చేస్తారు.

Dussehra 2021: ఇదేం పాడుపని.. ఉత్సవాల పేరుతో దుర్గమ్మ ఆలయం ముందు అశ్లీల నృత్యాలు..
Dance
Follow us on

Navaratri 2021: దేవీ నవరాత్రులు అంటే సాధారణంగా ప్రజలు భక్తి ప్రపత్తులతో, ఎంతో నిష్టంగా ఉంటారు. ఉదయాన్నే లేచి స్నానమాచరించి ఆధ్యాత్మిక చింతనలో అమ్మవారికి పూజలు చేస్తారు. అసలు అమ్మవారి పూజ అంటేనే ఎంతో నిష్టగా ఉండాలంటారు. కానీ, అక్కడ మాత్రం అంతా రివర్స్.. ఏ పండుగ అయినా, ఏ సంరద్భం అయినా అశ్లీలత తాండవించాల్సిందే. ఫంక్షన్లు మొదలు.. భక్తి కార్యక్రమాల వరకు అన్ని సందర్భాల్లో అశ్లీల నిత్యాలు ఏర్పాటు చేయాల్సిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరు పల్లెపాలెంలో అశ్లీల నృత్యాల ఘటన వెలుగు చూసింది. దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ గుడి వద్ద అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు పలువురు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడి చేరుకున్నారు. ఇద్దరు మహిళలు ఆర్గనైజర్ ఏసుబాబు తో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఎక్కడైనా అశ్లీల నృత్యాలు, అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాగా, దుర్గామాత వేడుకల్లో అశ్లీల నత్యాలు ఏంటంటూ స్థానిక హిందుత్వ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read:

Indian Railways: ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్‌.. ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం..!

Shiba Inu: బిట్ కాయిన్‌ను మంచి పరుగులు.. 260 శాతం పెరిగిన శిబా ఇను.. మీరు కూడా..

Bigg Boss 5 Telugu: కాజల్ ఫేక్… ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు తెలియకుండా మాట్లాడకు.. హమీదా సూచన..