AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ప్రవర్తన మార్చుకోమని చెప్పిన భర్త.. వినని భార్య.. చివరకు ఎంత ఘోరం..

అనుమానం పెను భూతమైంది.. భార్య ప్రవర్తన భర్తకు నచ్చలేదు.. పలు మార్లు చెప్పాడు.. అయినా.. ఆమె వినలేదు.. దీంతో ఆమె ప్రవర్తన నచ్చక దారుణానికి ఒడిగట్టాడు.. భర్త.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. భార్య ప్రవర్తన నచ్చని భర్త ఆమె గొంతుకోసి హతమార్చాడు..

Andhra: ప్రవర్తన మార్చుకోమని చెప్పిన భర్త.. వినని భార్య.. చివరకు ఎంత ఘోరం..
Ap Crime News
Raju M P R
| Edited By: |

Updated on: Aug 17, 2025 | 3:16 PM

Share

అనుమానం పెను భూతమైంది.. భార్య ప్రవర్తన భర్తకు నచ్చలేదు.. మార్చుకోమని పలుమార్లు  చెప్పాడు.. అయినా.. ఆమె వినలేదు.. దీంతో ఆమె ప్రవర్తన నచ్చక దారుణానికి ఒడిగట్టాడు.. భర్త.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. భార్య ప్రవర్తన నచ్చని భర్త ఆమె గొంతుకోసి హతమార్చాడు.. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.. భార్య ప్రవర్తన నచ్చని భర్త.. ఆమెను హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కోదలమడుగులోని బీసీ కాలనీలో శనివారం జరిగింది.

వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం హరిబాబు – ప్రియాంక (21) లకు పెళ్లి జరిగింది.. ఈ దంపతులకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కొంతకాలం వరకు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే.. అనుమానం పెనుభూతంగా మారింది. పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న హరిబాబుకు భార్య ప్రియాంక ప్రవర్తన పట్ల అనుమానం వచ్చింది. అదే గ్రామంలో ఉన్న మరో వ్యక్తితో ప్రియాంకకు వివాహేతర సంబంధం ఉందని భావించిన హరిబాబు.. ప్రవర్తన మార్చుకోవాలంటూ నచ్చజెప్పాడు.. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.. దీంతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది..

దీంతో హరిబాబు.. ప్రియాంక దగ్గరకు శుక్రవారం వెళ్లాడు.. ఈ క్రమంలోనే.. శనివారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన హరిబాబు.. అక్కడే ఉన్న కత్తి తీసుకుని.. భార్య ప్రియాంకను గొంతు కోసి హత మార్చాడు. అనంతరం బిడ్డను తీసుకుని వెళ్లి.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న బంగారుపాళ్యం పోలీసులు .. వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని బంగారుపాళ్యం పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..