Andhra Pradesh: తాడేపల్లి గూడెంలో దారుణం.. మారిపోయానని నమ్మించి.. అర్ధాంగిని ముక్కలు ముక్కలుగా నరికిన భర్త

|

Apr 28, 2023 | 1:17 PM

పశ్చిమగోదావరి జిల్లాలో భార్యాబిడ్డల పాలిట యముడిగా మారాడు ఓ వ్యక్తి. మొన్నటి వరకు కన్నబిడ్డలకు నరకం చూపించిన సైకో...ఇప్పుడు ఏకంగా కట్టుకున్న భార్యనే నరికి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Andhra Pradesh: తాడేపల్లి గూడెంలో దారుణం.. మారిపోయానని నమ్మించి.. అర్ధాంగిని ముక్కలు ముక్కలుగా నరికిన భర్త
Wife Murder
Follow us on

పశ్చిమగోదావరి జిల్లాలో భార్యాబిడ్డల పాలిట యముడిగా మారాడు ఓ వ్యక్తి. మొన్నటి వరకు కన్నబిడ్డలకు నరకం చూపించిన సైకో…ఇప్పుడు ఏకంగా కట్టుకున్న భార్యనే నరికి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ మధ్య కన్నబిడ్డలను చిత్రహింసలకు గురిచేసిన ఈ సైకో ఇప్పుడు ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడీ దుర్మార్గుడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వీరంపాలెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. భార్య గంజి నిర్మలతో నిన్న అర్థరాత్రి ఘర్షణకు దిగిన ఆమె భర్త గంజి దావీదు.. కత్తితో భార్య గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. నిర్మలపై కత్తితో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచేశాడు ఈ సైకో. భార్య మెడ, చేతులపై కత్తితో బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది నిర్మల. అప్రయోజకుడు… రౌడీ ఇజం తప్ప బాధ్యత తెలియని భర్త…లోకం తెలియని ఇద్దరు బిడ్డలు…ఇల్లు గడవడం కష్టమైంది. భర్త దగ్గర ఉండగా పిల్లలను సాకడం సాధ్యం కాదని భావించి పిల్లలను భర్త దగ్గర వదిలి దుబాయి వెళ్ళిపోయింది నిర్మల. దుబాయిలో ఉన్న భార్యను వేధించేందుకు ఓ దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు దావీదు.

అమాయకమైన పిల్లలపై తన ప్రతాపం చూపించాడు. తాగొచ్చి పసిపిల్లలకు ప్రత్యక్ష నరకం చూపించాడు. పిల్లలను విచక్షణారహితంగా బాదడమే కాకుండా ఈ ఘోరాన్ని వీడియో తీసి..భార్యకి పంపించేవాడు ఈ సైకో. కూతుళ్ళను చిత్రహింసలకు గురిచేస్తోండడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన భార్యను మూడు రోజుల క్రితం తాను మారిపోయానంటూ ఇంటికి తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు హంతకుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..