రైల్వే చరిత్రలో సంచలనం.. రోబో కాప్ అర్జున్‌తో పహారా.. నేరస్తులు ఇట్టే దొరికిపోవాల్సిందే..!

భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే వినూత్న ఆలోచన చేసింది. హ్యూమనాయిడ్ రోబో పోలీస్‌ను రైల్వేలో తొలిసారిగా ప్రవేశపెట్టింది. నిత్యం పహారా కాసే రోబో కాప్ సేవలను విశాఖపట్నంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్పీఎఫ్ ఐజీ ఆలోక్ బొహ్రా, డీఆర్ఎం లలిత్‌ బొహ్రా చేతుల మీదుగా ఈ రోబో పోలీస్‌ను ఆవిష్కరించారు.

రైల్వే చరిత్రలో సంచలనం.. రోబో కాప్ అర్జున్‌తో పహారా.. నేరస్తులు ఇట్టే దొరికిపోవాల్సిందే..!
Robot Cop Arjun At Visakhapatnam

Edited By:

Updated on: Jan 23, 2026 | 4:40 PM

భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే వినూత్న ఆలోచన చేసింది. హ్యూమనాయిడ్ రోబో పోలీస్‌ను రైల్వేలో తొలిసారిగా ప్రవేశపెట్టింది. నిత్యం పహారా కాసే రోబో కాప్ సేవలను విశాఖపట్నంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్పీఎఫ్ ఐజీ ఆలోక్ బొహ్రా, డీఆర్ఎం లలిత్‌ బొహ్రా చేతుల మీదుగా ఈ రోబో పోలీస్‌ను ఆవిష్కరించారు. దీనికి ఏఏస్సీ అర్జున్‌గా నామకరణం చేశారు. ఏఐ టెక్నాలజీ, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీలతో అభివృద్ధి చేసిన ఈ రోబో విశేషాలు ఏంటో తెలుసా..?

దీన్ని పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే రూపొందించారు. భద్రతాపరమైన అంశాలపై పర్యవేక్షణకు రైల్వే పోలీసులు వినియోగిస్తారు. ఈ రోబో పోలీస్ అర్జున్ రైల్వే స్టేషన్‌లో నిత్యం పహారా కాస్తుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా.. అనుమానితులు, చొరబాటుదారులను గుర్తిస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడేవారిని, అనుమానితుల ఫొటోలు తీసి విశ్లేషిస్తుంది. పారిశుద్ధ్యం లాంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సూచనలు జారీ చేస్తుంది.

వివిధ భాషల్లో ప్రయాణికులతో సంభాషిస్తుంది అప్రమత్తం చేస్తుంది. అంతేకాదండోయ్.. ప్రయాణీకుల నమస్తే చేస్తోంది. ఆర్పీఎఫ్ పోలీసులు వస్తే వారికి తగ్గట్టు సెల్యూట్ కూడా చేస్తుంది ఈ రోబో కాప్. రోబోలో ఇంటిగ్రేటెడ్ డాష్‌ బోర్డు ఉంటుంది. దీంతో రియల్ టైమ్ ఇంటలిజెన్స్‌తో ఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అగ్ని ప్రమాదాలు, పొగను సకాలంలో గుర్తించి.. సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా అనుమానితుల గుర్తింపు, ప్రయాణికుల భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, ప్లాట్‌ఫామ్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంది ఈ హ్యూమనైడ్ రోబో అర్జున్. భవిష్యత్తులో ఇటువంటి రోబోల సేవలను మరిన్ని రైల్వే స్టేషన్‌లలో వినియోగించుకునేలా యోచిస్తున్నారు రైల్వే అధికారులు.

వీడియో చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..