Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

ఆది సాయంత్రం వేళ.. అందరూ ఎవరి ఇంటికి వాళ్లు వెళ్తున్నారు. ఇంతలో ఒక అపార్ట్‌మెంట్‌ పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ సమీపంలోని పొదల్లో వింతశబ్ధాలు వినిపించాయి. అటుగా వెళ్తున్న వ్యక్తం ఏంటా అని మెల్లగా పొదల దగ్గరకు వెళ్లి చూశాడు. అంతే దెబ్బకు భయంతో వెనక్కి వచ్చాడు. ఇంతకు పొదల్లో అతను ఏం చూశాడో తెలుసా?.. అయితే ఈ స్టోరీ చదవండి.

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి
Viral Video

Edited By:

Updated on: Oct 04, 2025 | 10:13 PM

ఆది విశాఖపట్నం జిల్లాలోని అక్కయ్యపాలెం నరసింహనగర్ కాలనీ.. అప్పుడే చిన్నగా చీకటి పడుతోంది. అందరూ ఎవరు ఇళ్లలోకి వాళ్ళు చేరుకుంటున్నారు. ఇంతలో ఒకటే అలజడి. స్థానికంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఆ పక్కనే ఉన్న పొదల్లోంచి ఏవే వింతశబ్ధాలు.. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఏంటా అని ఆ పొదల దగ్గరకు వెళ్లాడు. వాటిని కొద్దిగా జరిపి తొంగి చూసాడు. అంతే భయంతో వెనకడుగా వేశాడు. ఎందుకంటే ఆ పొదల్లో అతను భారీ కొండచిలువను చూశాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు.

స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థాలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్‌ కొండచిలువను పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. దాన్ని పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ కొండచిలువ అతని కాలుకు చుట్టుకొని చాలా సేపు అతన్ని ముప్పతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు స్నేక్ క్యాచర్ కిరణ్ దాన్ని పట్టుకున్నాడు. కొండచిలువను ఒక సంచిలో అక్కడి నుంచి తీసుకెళ్లాడు దీంతో స్థానికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అయితే స్నేక్ క్యాచర్‌ కొండచిలువను పట్టుకుంటుండగా భారీగా జనాలు గుమిగూడారు. ఆ భారీ కొండచిలువ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us