ఆర్టీసీ బస్సులో రూ. కోటీ 90 లక్షలు తరలింపు.. రసీదులు చూపకపోగా పొంతనలేని సమాధానాలు.. మొత్తం నగదును సీజ్ చేసిన పోలీసులు..

|

Dec 13, 2020 | 3:30 PM

కర్నూలు జిల్లాలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఈ నగదుకు సరైన పత్రాలు చూపకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకెళితే.. కర్నూలు నగర శివారులోని...

ఆర్టీసీ బస్సులో రూ. కోటీ 90 లక్షలు తరలింపు.. రసీదులు చూపకపోగా పొంతనలేని సమాధానాలు.. మొత్తం నగదును సీజ్ చేసిన పోలీసులు..
Follow us on

కర్నూలు జిల్లాలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఈ నగదుకు సరైన పత్రాలు చూపకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకెళితే.. కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్‌ దగ్గర ఎస్ఈబీ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సును కూడా తనిఖీ చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురానికి చెందిన కోనేటీ రామచౌదరి బ్యాగ్‌లో రూ. కోటీ 90 లక్షల నగదును గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి పత్రాలను చూపాల్సిందిగా పోలీసులు రామచౌదరిని అడిగారు. అయితే అతను రసీదులను చూపకపోగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. ఈ విషయాన్ని కర్నూలు డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు. డబ్బు ఎవరి దగ్గర నుంచి తీసుకువస్తున్నారు? ఎందుకు తీసుకువస్తున్నారు? అనే విషయాలపై స్పష్టత లేనందున దీనిపై మరింత లోతుగా విచారిస్తామని డీఎస్పీ మహేష్ తెలిపారు.