తిరుపతిలో 20 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్ (Cell Phones) లను పోలీసులు స్వాధీనం(Seize) చేసుకున్నారు. అర్బన్ జిల్లా పరిధిలో సెల్ ఫోన్స్ మిస్సింగ్ పై నమోదైన కేసుల్లో 134 సెల్ ఫోన్స్ లను రికవరీ చేశారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ నెల వరకు సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారి ఫిర్యాదులపై సైబర్ క్రైమ్(Cyber Crime) టీమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి అప్పగించి నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఎస్పీ వెంకట అప్పలనాయుడు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఎవరైనా ఎక్కువ విలువ గల ఫోన్లను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో అమ్మేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితులలో కొనుగోలు చేయవద్దని ఎస్పీ కోరారు. ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాల్సి వస్తే బిల్లును చూసి కొనాలని సూచించారు. మార్కెట్ లేదా రద్దీ ప్రదేశాలలో తిరిగేటప్పుడు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Also Read
TV9 Digital News Round Up: మూవీలో చిరు, చరణ్ ఫైటే హైలైట్! || సమంత వర్కవుట్ నెట్టింట్లో వైరల్ ..
RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూల్ చేసిందంటే..