తాడేపల్లి ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని, బాలికను గంజాయి మత్తుతో హత్య చేయలేదని, వ్యక్తిగత కక్ష కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పారు. గంజాయి అమ్మకాలను అరికట్టామన్న హోం మంత్రి.. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం మీద నిందలు వేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అప్పటి ప్రభుత్వం నిందితుల తరఫునే నిలబడింది. తాడేపల్లి ఘటన లో తాము ఎందుకు రాజీనామా చేయాలి. పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి చనిపోతే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారా..?. సీతా నగరం అత్యాచారం కేసులో మహిళా నర్సు పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో మరో నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. అతణ్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
– తానేటి వనిత, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తాడేపల్లి బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు కుక్కల రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. అతనికి శిక్ష పడేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ..