AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasibugga Temple: ‘తిరుమలలో దర్శనానికి అనుమతించలేదు.. అందుకే మా పొలంలో గుడి కట్టా’.. చరిత్ర ఇదిగో

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందా?.. ఇకపై.. ప్రైవేటు ఆలయాలపైనా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టబోతోందా?.. అసలు కాశీబుగ్గలో ఆ ఆలయం ఎప్పుడు కట్టారు.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఇక్కడ లుక్కేయండి మరి.

Kasibugga Temple: 'తిరుమలలో దర్శనానికి అనుమతించలేదు.. అందుకే మా పొలంలో గుడి కట్టా'.. చరిత్ర ఇదిగో
Kasibugga Temple
Ravi Kiran
|

Updated on: Nov 02, 2025 | 10:59 AM

Share

శ్రీకాకుళం కాశిబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయం, వందల ఏళ్ల నాటి చరిత్రేమీలేదు. కేవలం 6నెలల కిందటే ఓపెన్ అయిన ఆలయం. ఒక ప్రైవేట్ టెంపుల్. తిరుమల రెప్లికాతో నిర్మించి, శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితమైన క్షేత్రం. ఇప్పుడిప్పుడే స్థానికంగా జనం నోళ్లలో నానుతున్న గుడి. తిరుమల తరహాలోనే గోపురం, గర్బగుడి ఉండడంతో భక్తులను ఆకట్టుకుంది. కానీ అతి తక్కువ కాలంలో ఇంతలా ప్రాచుర్యం పొందడానికి కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

హరిముకుంద పండా…95ఏళ్ల వృద్ధుడు. పదేళ్ల కిందట శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. క్యూలైన్లో నిల్చోలేక అక్కడున్న సిబ్బంది స్వామి దర్శనానికి అనుమతించకపోవడంతో, నిరాశతో వెనుదిరిగివచ్చాడు. అప్పుడు తానే శ్రీవారికి ఆలయం కట్టించాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబానికి చెందిన కొబ్బరి తోటల్లో తిరుమల రెప్లికా ఆలయాన్ని నిర్మించాడు. 2019లో ప్రారంభమైన గుడి నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంకా పూర్తి కాలేదు. తిరుమల ఆనంద నిలయం తరహాలో గోపురం ఏకశిల విగ్రహాలతో నిర్మించారు. శ్రీవేకంటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి నవగ్రహాలు, సకల దేవతా మూర్తులు కూడా ఉన్నాయి. ఒక కోనేరు కూడా నిర్మించారు. టీటీడీ నిర్మించిన ఆలయానికి కూడా రాని ప్రచారం ఈఆలయానికి అతి తక్కువ కాలంలో వచ్చింది., కారణం. ఆలయం నిర్మించిన పండాకు స్థానికంగా మంచి పేరు ఉండటం.

స్వామివారి మీద భక్తితో హరిముకుందన్ పండా ఆలయం నిర్మించారు సరే. కానీ నియమాలు ఆలయ నిర్వాహకులు పాటించారా..? ఆలయ నమూనాల విషయంలో యాక్ట్ ఏం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్,1987 లో ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఈ యాక్ట్ కొత్త ఆలయాల స్థాపన, రిజిస్ట్రేషన్, నిర్వహణ, ట్రస్టీల నియామకం, ఆస్తులకు సంబంధించి స్పష్టమైన నియమాలను సూచించింది. రెప్లికా నిర్మాణం కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది. ప్రైవేట్ ఆలయాలైనా ఎండోమెంట్ యాక్ట్ అనుగుణంగానే నిర్మించాలంటున్నారు అధికారులు. అయితే కాశిబుగ్గ ఆలయం విషయంలో నిర్మాణంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ భక్తుల భద్రతపై దృష్టిపెట్టినట్లు కనిపించలేదు. ఇంకా నిర్మాణ దశలోనే ఆలయం ఉండటం కూడా భక్తుల మరణానికి కారణమైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మరి కాశిబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
మీకు సన్ రైజ్ అంటే ఇష్టమా.? ఇండియాలో ఈ ప్లేసులు బెస్ట్..
మీకు సన్ రైజ్ అంటే ఇష్టమా.? ఇండియాలో ఈ ప్లేసులు బెస్ట్..
షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ
వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ
జుట్టుకే కాదు ఉల్లిపాయ రసంతో మరెన్నో లాభాలు.. మొండి సమస్యలకు చెక్
జుట్టుకే కాదు ఉల్లిపాయ రసంతో మరెన్నో లాభాలు.. మొండి సమస్యలకు చెక్
ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఈ గోవా బీచ్‎ల చాలా పీస్‎ఫుల్.. వెళ్లారంటే.. మీ స్ట్రెస్ క్లియర్..
ఈ గోవా బీచ్‎ల చాలా పీస్‎ఫుల్.. వెళ్లారంటే.. మీ స్ట్రెస్ క్లియర్..
రోజూ లవంగాలు తిన్నారంటే.. అనారోగ్యం హాంఫట్ స్వాహా..
రోజూ లవంగాలు తిన్నారంటే.. అనారోగ్యం హాంఫట్ స్వాహా..
తెలిసిన మహిళ ఇంటినే టార్గెట్ చేసింది.. 4 నెలల తర్వాత..
తెలిసిన మహిళ ఇంటినే టార్గెట్ చేసింది.. 4 నెలల తర్వాత..
ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
ఈ మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ దెబ్బ.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ
వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ