CM Jagan: ఈసారి సీఎం జగన్ బరిలోకి దిగేది పులివెందుల నుంచి కాదా..?

బాలయ్య కంచుకోటపై సీఎం ఫోకస్ పెడతారా..? నందమూరి బాలకృష్ణకు జగన్ యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఫ్యాన్ అని చెబుతుంటారు. అలాంటి బాలయ్యపై ఏకంగా సీఎం స్థాయిలో జగనే బరిలోకి దిగుతారా...? ఇంట్రస్టింగ్ కథనం మీ కోసం

CM Jagan: ఈసారి సీఎం జగన్ బరిలోకి దిగేది పులివెందుల నుంచి కాదా..?
CM Jagan

Updated on: Jul 07, 2023 | 12:18 PM

సీఎం జగన్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఏంటి..? అదేంటి కొత్తగా అడుగుతారు..? పులివెందులే కదా.. అది ఆయనకు కంచుకోట. జస్ట్ నామినేషన్ వేసి వస్తే చాలు ప్రచారం కూడా చేయకుండానే బంపర్ మెజార్టీతో గెలిచేస్తారు. ప్రతిపక్షాలు కూడా అక్కడ క్యాండిడేట్‌ను పెట్టాలి కాబట్టి ఫార్మల్‌గా పెడతారు. పోయినసారి దాదాపు 90 వేల పైచిలుకు జగన్‌కు మెజార్టీ వచ్చింది. ఈసారి అది లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నారు. అలాంటి సొంత గడ్డను వదిలేసి.. ఆయన ఎక్కడికి వెళ్తారు అనే డౌట్ వస్తుంది కదూ…?. ఇప్పుడు మీకు ఆ క్లారిటీనే ఇవ్వబోతున్నాం.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ పోటీ చేయాలట. ఈ రిక్వెస్ట్ వస్తున్నది హిందూపూర్ వైసీపీ నాయకులు, కార్యకర్తల నుంచి. సీఎం వైఎస్ జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలని వైసీపీ నాయకుడు నరేష్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ర్యాలీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి మహిళలతో పట్టణంలో భారీ ర్యాలీ తీశారు.  బాలకృష్ణ సినీ గ్లామర్‌తో వరుసగా విజయం సాధిస్తున్నాడని.. ఆయన్ను ఢీకొట్టేందుకు సరైన వ్యక్తులు వైఎస్ ఫ్యామిలీ నుంచి రావాలన్నది వారి వెర్షన్. ఎమ్మెల్యే బాలకృష్ణకు చెక్ పెట్టాలంటే వైఎస్ కుటుంబం హిందూపురంలో పోటీ చేయాలంటున్నారు నరేశ్. హిందూపురంలో వైఎస్ కుటుంబం పోటీ చేయా‌లని కోరుతూ… పోస్ట్ కార్డు ఉద్యమాన్ని సైతం ప్రారంభిస్తానని నరేశ్ చెబుతున్నాడు.

అయితే ఎన్నికల నియమావళి ప్రకారం.. ఒక అభ్యర్థి 2 చోట్ల నుంచి పోటీ చేసే వీలుంటుంది. అయితే 2 చోట్లా గెలిస్తే.. ఆ తర్వాత ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల లోపల ఆ స్థానానికి మళ్లీ ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఆ లెక్కన అటు పులివెందులు, ఇటు హిందుపూర్..  2 స్థానాల్లో సీఎం జగన్  పోటీ చేసి బాలయ్య ఓడించచ్చు. మరి హిందూపురం కార్యకర్తల మాటను జగన్‌ను పరిగణలోకి తీసుకుంటారా..? రెండు స్థానాల్లో పోటీ చేస్తారా..? లేదా తన కుటుంబం నుంచి హిందూపూర్‌లో ఎవర్నైనా బరిలోకి దించుతారా చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..