Andhra Pradesh: అటు పెద్దిరెడ్డి.. ఇటు చంద్రబాబు.. మస్త్ మజా ఇస్తున్న పొలిటికల్ పోరు.. ఎవరూ తగ్గట్లేదుగా..

|

Aug 06, 2023 | 1:38 PM

బ్యాక్‌డ్రాప్‌లో చూస్తే ఇటీవలి కుప్పం రణరంగం కనిపిస్తుంది. రోడ్‌ షోకు పర్మిషన్‌ ఎందుకివ్వరు.. నా నియోజకవర్గంలోకి నేనెందుకు వెళ్లకూడదు.. 5 కోట్ల మంది తరఫున అడుగుతున్నా ఆన్సర్‌మీ.. అంటూ కోపంతో ఊగిపోయిన చంద్రబాబుకు ఆరోజు నిజంగానే చుక్కలు కనిపించాయి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ జనవరి నెల్లో మూడురోజుల కుప్పం టూర్‌కి స్కెచ్చేశారు బాబు. అప్పట్లో రోడ్‌షోలను నిషేధిస్తూ జీవో నం.1 అమల్లోకొచ్చింది. దాన్ని కారణంగా చూపుతూ బాబు టూర్‌ని..

Andhra Pradesh: అటు పెద్దిరెడ్డి.. ఇటు చంద్రబాబు.. మస్త్ మజా ఇస్తున్న పొలిటికల్ పోరు.. ఎవరూ తగ్గట్లేదుగా..
Chandrababu Vs Peddireddy Ramachandra Reddy
Follow us on

ఆయన కుప్పం మీద ఫోకస్ పెడితే.. ఈయన పుంగనూరును టార్గెట్ చేశారా? చిత్తూరు జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలూ హాట్‌హాట్‌గా ఎందుకు మారాయి..? అసలు చంద్రబాబుకీ, పెద్దిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే ఎందుకింతగా భగ్గుమంటోంది? ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ కావాలంటే వీళ్లిద్దరి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి తీరాల్సిందే.

వైనాట్ పులివెందుల అని వాళ్లంటే.. వైనాట్ కుప్పం అని వీళ్లంటారు. ఏపీలో ముఖ్యమంత్రి నియోజకవర్గాలే టార్గెట్‌గా పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీనికి సప్లిమెంటరీ ఏంటంటే.. వైనాట్ పుంగనూరు. టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్‌గా ఎత్తుకున్న కొత్త నినాదం ఇది. బాబు అటువైపుగా వస్తున్నారు అనగానే పుంగనూరులో యుద్ధం కంపల్సరీ అని కన్ఫామ్ చేసుకున్నాయి రెండు పార్టీలూ. చివరకు జరిగింది కూడా ఇదే.

పుంగనూరు విధ్వంసం బ్యాక్‌డ్రాప్‌లో చూస్తే ఇటీవలి కుప్పం రణరంగం కనిపిస్తుంది. రోడ్‌ షోకు పర్మిషన్‌ ఎందుకివ్వరు.. నా నియోజకవర్గంలోకి నేనెందుకు వెళ్లకూడదు.. 5 కోట్ల మంది తరఫున అడుగుతున్నా ఆన్సర్‌మీ.. అంటూ కోపంతో ఊగిపోయిన చంద్రబాబుకు ఆరోజు నిజంగానే చుక్కలు కనిపించాయి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ జనవరి నెల్లో మూడురోజుల కుప్పం టూర్‌కి స్కెచ్చేశారు బాబు. అప్పట్లో రోడ్‌షోలను నిషేధిస్తూ జీవో నం.1 అమల్లోకొచ్చింది. దాన్ని కారణంగా చూపుతూ బాబు టూర్‌ని పోలీసులు అనుమతించలేదు. టీడీపీ శ్రేణులతో పాటు టీడీపీ బాస్ కూడా పోలీసుల మీద ఇంతే పిచ్‌లో ఫైరయ్యారు.

కుప్పంలో అలనాటి అగ్గి వెనక్కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉన్నట్టు అనుమానించింది టీడీపీ. అధికారంలోకి రావాలన్న యావతో ఇంకా ఎంతమందిని చంపుతావు చంద్రబాబూ అంటూ పెద్దిరెడ్డి ఇచ్చిన రియాక్షన్ కూడా అదే రేంజ్‌లో ఉంది. మీ అందరి చిట్టా రాస్తున్నా.. పుంగనూరులో నువ్వు ఓడిపోవడం పక్కా అని చంద్రబాబు శపిస్తే.. నీ పప్పులు పుంగనూరులో ఉడకవ్ బాబూ అని కౌంటరిచ్చారు పెద్దిరెడ్డి.

చిత్తూరు జిల్లాలో వైసీపీ క్వీన్‌స్వీప్ చేసి జగన్‌కి గిప్టుగా ఇవ్వాలనేది పెద్దిరెడ్డి టార్గెట్‌ అట. మరీముఖ్యంగా కుప్పంను కొట్టడానికి జిల్లాలోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారట. చంద్రబాబు కూడా పెద్దిరెడ్డి ఎత్తుల్ని చిత్తు చెయ్యడమే డ్యూటీగా పెట్టుకున్నారు. కుప్పంలో జెండా పీకేసే టైమొచ్చింది.. నా అంతు నువ్వు చూడ్డం కాదు.. ప్రజలే నీ అంతు చూస్తారు.. కాచుకో అంటూ అప్పట్లోనే సవాల్ విసిరారు పెద్దిరెడ్డి. జగన్ ఆదేశించాలే గాని కుప్పంలో బాబు మీద పోటీకి సైతం నేను రెడీ.. అంటూ మరో అడుగు ముందుకేశారు.

కుప్పం వర్సెస్ పుంగనూరు.. చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి.. ఈ యుద్ధం ఇప్పటిది కాదు. నాలుగున్నర దశాబ్దాల నాటి వైరం. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్నుంచీ ఒకరి వెంట ఒకరు పడేవారు. పెద్దిరెడ్డి సోషియాలజీ.. చంద్రబాబు ఎకనమిక్స్.. ఆయన రెడ్లకు ప్రాతినిధ్యం వహిస్తే.. ఈయన బీసీల్ని వెనకేసుకొచ్చేవారు. ఆర్ట్స్‌ కాలేజ్‌లో డిగ్రీ చదివేటప్పుడే స్టూడెంట్ పాలిటిక్స్‌లో ఆరితేరిన ఇద్దరూ.. ఇవాళ్టి దాకా అదే టెంపో కంటిన్యూ చేస్తున్నారు.

చంద్రబాబు సీఎంగా చేసిన అనుభవజ్ఞుడు. ప్రస్తుతం పెద్దిరెడ్డి పొలిటికల్ స్టేటస్ కూడా దాదాపు సీఎం రేంజే అనేది జిల్లాలో ఆయన అనుచరులు చెప్పుకునే మాట. జిల్లా మంత్రిగా సీమ నుంచి జగన్‌కు మెయిన్ పిల్లర్‌గా ఉంటున్నారు పెద్దిరెడ్డి. అందుకే.. కుప్పం నుంచి చంద్రబాబును వెకేట్ చేయించాలనే టార్గెట్‌ని పెద్దిరెడ్డి చేతికే ఇచ్చేశారట సీఎం జగన్. చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో వీళ్లిద్దరూ కొలీగ్స్. తాను ముఖ్యమంత్రిగా ఎదిగి రాష్ట్రాన్ని ఏలినా సొంత జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కొరకరాని కొయ్యగా మారారు. అందుకే వీళ్లిద్దరిదీ టామ్ అండ్ జెర్రీల పోరాటంగా మారింది.

ఇటీవల పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని రొంపిచర్లలో కూడా పెద్దిరెడ్డి వర్గానికి, టీడీపీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. ఇప్పుడు పుంగనూరు ఘర్షణ సినిమా… అంతకు మించి. చంద్రబాబే కార్యకర్తల్ని ఉసిగొల్పినట్టు ఆధారాలు చూపిస్తోంది వైసీపీ. బాధ్యులు ఎంతటివాళ్లనైనా ఉపేక్షించబోమంటోంది ఏపీ సర్కారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి.. పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమే లక్ష్యంగా చంద్రబాబు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ స్పెషల్‌గా కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో 43 వేల మెజారిటీతో గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈసారి ఓడించడం కోసం చల్లా బాబును ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు విధ్వంసం కేసులో ఆ చల్లా బాబు మీదే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మరి.. వైనాట్ పుంగనూరు నినాదాన్ని చంద్రబాబు ఎంతవరకు లాగుతారు అనేది సస్పెన్స్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..