ఓవైపు ఎండలు ముదిరాయి. మరోవైపు H3N2 వైరస్ టెర్రర్ లేపుతోంది. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలను స్కూళ్లకు పంపొద్దని విద్యాశాఖ తల్లిదండ్రులను కోరింది. ఒంటి పూట బడులపై అధికారక ప్రకటన చేయలేదు విద్యాశాఖ. మాములుగా అయితే మార్చి 15 నుంచే హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. అయితే గత ఏడాది మాత్రం ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడులు పెట్టారు. కరోనా నేపథ్యంలో స్కూల్స్ లేటుగా ప్రారంభం అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కూడా అదే విధానం ఫాలో అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. హాఫ్ డే స్కూల్స్ అప్పుడు ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుంది. పోయిన ఈ ఏడాది ఈ టైమింగ్స్ ప్రకారమే క్లాసులు చెప్పారు.
2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1 నుంచి 9 క్లాసుల స్టూడెంట్స్‌కు సమ్మెటివ్-2 ఎగ్జామ్స్ ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. మరో 2 రోజులు పరీక్షా ఫలితాల వెల్లడి, తల్లిదండ్రుల మీటింగ్స్ వంటివి ఉండనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వుతుంటే ఈ సెలవులు షెడ్యూల్ కాస్త ముందుకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మళ్లీ జూన్ 12 నుంచి పాఠశాలలు రీ ఓపెన్ అవుతాయి. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..