Andhra: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వచ్చే 3 రోజుల్లో జోరున వానలు.. ఈ ప్రాంతాలకు..

ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గౌహతిలో సగ భాగం నీట మునిగింది. భారీ వర్షాలు వరదలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ వివరాలు..

Andhra: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వచ్చే 3 రోజుల్లో జోరున వానలు.. ఈ ప్రాంతాలకు..

Updated on: May 31, 2025 | 8:36 PM

నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో వచ్చే 3 రోజుల్లో జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపధ్యంలోనే ఆదివారం(01-06-25) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందంది.

సోమవారం(02-06-25) ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 49మిమీ, విజయనగరం జిల్లా పెద్దనడిపల్లిలో 46మిమీ, డెంకాడలో 43మిమీ, శ్రీకాకుళం జిల్లా గరికిపాలెం 42మిమీ వర్షపాతం నమోదయింది. అలాగే జూన్ రెండో వారం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయి. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఇక తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్‌, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్‌ ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..