Nellore Floods and Rains: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బధంలో చిక్కుకున్నాయి. పెన్నా వర్షాలు, వరదలతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నెల్లూరు నగర ప్రజలు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. సోమశిల నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగు ప్రాంతాలైన జయలలిత నగర్ కు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ గ్రామ ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని అధికారులు సూచించారు. మరోవైపు కోవూరు మండలం పెనుబల్లి, కాకుల పాడు సహా పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. భగత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. అయితే ఎగువ ప్రాంతాల్లోని వర్షాలు, వరదలతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు మరో నాలుగు గంటల్లో నీటి మట్టం మరింత పెరగనుందని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
భారీగా పంట నష్టం…
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా భారీగా పంట నష్టం జరిగింది. 5173 హెక్టార్లలో వరి, 12 హెక్టార్లలో వేరుశనగ తో పాటు 310 హెక్టార్లలో పొగాకు 3182 హెక్టార్లలో మినుము పంట నీటి పాలయ్యాయి. చేతికి అంది వచ్చిన పంట నీట మునగడంతో అన్నదాత కన్నీరు పెట్టాడు. ముంపు పరివాహక ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పెన్నా పరివాహక ప్రాంతాలోని మూడువేల మందిని ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ముంపు వాసులకు భోజనం, మంచినీరు, పాలు అందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. అంతేకాదు పెన్నా నది వరద ఉధృతి తగ్గేవరకూ వరద బాధితులను పునరావాస కేంద్రాల్లో నే ఉంచుతామని కమిషనర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ముంపువాసులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
Also Read: