Tungabhadra River: ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్రానది.. నిండుకుండలా తుంగభద్రడ్యాం.. అన్నదాతలు హర్షం..

|

Nov 21, 2021 | 11:49 AM

Tungabhadra River: రాయలసీమ జిల్లాలు వర్షాలు, వరదలతో అతాకుతలమవుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల..

Tungabhadra River: ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్రానది.. నిండుకుండలా తుంగభద్రడ్యాం.. అన్నదాతలు హర్షం..
Tungabhadra River Floods
Follow us on

Tungabhadra River: రాయలసీమ జిల్లాలు వర్షాలు, వరదలతో అతాకుతలమవుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎగువున కురుస్తున్న వర్షాలు, వరదలతో తుంగభద్రా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లాలో ప్రవహిస్తున్న తుంగభద్రా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో తుంగభద్రానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండటంతో పాటు నదిలోకి ఎవరు దిగ రాదని హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత నవంబర్ నెలలో పూర్తి స్థాయిలో డ్యాం 30 గేట్లు ఎత్తి నదికి విడుదల చేయడం ఇదే మొదటిసారి.

డ్యాంకు దిగువన ఉన్న సుంకేసుల రిజర్వాయర్ కూడా నిండి 15 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నది కి విడుదల చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరంతా శ్రీశైలంలో కలవనుంది. తుంగభద్రడ్యాం మరోసారి నిండడం తో కర్నూలు కడప అనంతపురం జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాలకు రబి సీజన్లో లో కూడా సాగునీటికి ధోకా లేనట్లేనని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

చట్ట సభలో దిగజారుడు భాష బాధాకరం.. ఏపీ అసెంబ్లీ తీరుపై పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

 తాకినా చూసినా ఈ చెట్టు నవ్వుతుంది.. అంతరించుపోతున్న జాతిలో కితకితల చెట్టు.. ఎక్కడుందంటే