Andhra Pradesh Rains: ఏపీలో కుండపోత వర్షాలు, ఊహించని రీతిన ప్రమాదాలు

తెలుగురాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి వర్షాలు. ఇటు తెలంగాణ.. ఆటు ఏపీలో రాత్రంతా అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ఎక్కువ ఏరియాల్లో జోరువాన

Andhra Pradesh Rains: ఏపీలో కుండపోత వర్షాలు, ఊహించని రీతిన ప్రమాదాలు
Rain Accidents

Updated on: Sep 05, 2021 | 7:46 AM

Heavy Rains: తెలుగురాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి వర్షాలు. ఇటు తెలంగాణ.. ఆటు ఏపీలో రాత్రంతా అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ఎక్కువ ఏరియాల్లో జోరువాన కురిసింది. వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోవడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అటు, కోనసీమలో రాత్రి భారీ వర్షం పడింది. అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం, అంబాజీపేట,రాజానగరం,కోరుకొండ, మన్యం ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో భారీ వర్షానికి చెట్టు కూలిపడింది. ఈ చెట్టు కిందనే విద్యార్థి.. చెట్టు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పక్కనే వున్న మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మూల భీమవరం వద్ద వరద నీటి తాకిడికి కొట్టుకుపోయింది కారు. చంద్రగిరి-పులిచెర్ల మార్గమధ్యలో ఉన్న మూల భీమవరం వద్ద కల్వర్టు పై ప్రవహిస్తున్న వర్షం నీటి ఉదృతిని గుర్తించకుండా.. కల్వర్టు దాటుతుండగా నీటి ప్రవాహంతో ఒక్కసారిగా కోతకు గురైంది రోడ్డు.

అటు తెలంగాణలో బీబీనగర్ మండలం రావిపహాడ్ అనాజీపురం వద్ద ఉధ‌ృతంగా ప్రవహిస్తోంది మూసీ నది. మూసీ ప్రవాహం పెరగడంతో రోడ్డుకు అడ్డంగా కంచె వేశారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, నెరేడిగొండ మండలాల్లో భారీగా కురిసింది వర్షం. దన్నుర్, సావర్గం వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదే పరిస్థితి.. ఆళ్లపల్లి మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తొంది.

కర్ణ గూడెం,సీతానగరం, చంద్రపూర్, గ్రామాలకు నిలిచిపోయాయి రాకపోకలు. కనీస అవసరాలు అందక ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. ఇల్లందు నుండి సత్యనారాయణపురం వెళ్లే రహదారిలో వంతెన పై నుండి ప్రవహిస్తోంది వరద నీరు. దీంతో సత్యనారాయణపురం-ఇల్లందు కు నిలిచాయి రాకపోకలు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

Read also: Telangana Rains: రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం.. పలు కాలనీలు, ఇళ్లల్లోకి వర్షపునీరు.. జనం అవస్థలు