Andhra Weather: అన్నోయ్.. బంగాళాఖాతంలో అల్పపీడనమట – వానలు దంచుడే

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులకు అప్రమత్తం సూచించారు.

Andhra Weather: అన్నోయ్.. బంగాళాఖాతంలో అల్పపీడనమట - వానలు దంచుడే
Andhra Weather Report

Updated on: Jun 26, 2025 | 1:41 PM

ఏపీకి ముసురు పట్టింది. వానలు ఇప్పుడే దంచికొడుతుండగా.. రెయిన్స్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వెదర్ అప్ డేట్ వచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారిణి తార స్వరూప తెలిపారు. ప్రస్తుతం ఇది 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. త్వరలో అల్ప పీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1.02 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 861.70 అడుగులకు చేరింది. అలాగే పూర్తి నీటినిల్వ 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 111.4 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి