Heavy Rains: కడప జిల్లాల్లో 40కి చేరిన మృతుల సంఖ్య.. మృతదేహాల కోసం గాలింపు చర్యలు..!

|

Nov 23, 2021 | 9:21 AM

Heavy Rains: ఏపీలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వరదల కారణంగా రోడ్డు, బ్రిడ్జిలు..

Heavy Rains: కడప జిల్లాల్లో 40కి చేరిన మృతుల సంఖ్య.. మృతదేహాల కోసం గాలింపు చర్యలు..!
Follow us on

Heavy Rains: ఏపీలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వరదల కారణంగా రోడ్డు, బ్రిడ్జిలు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇళ్లన్ని నేలమట్టమవుతున్నాయి. ఎందరో రోడ్డున పడ్డారు. వరదల కారణంగా చాలా కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించారు అధికారులు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు ఇంకా కోలుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో.. ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. అటు పంట మొత్తం.. నీట మునిగి రైతు కంట కన్నీరు పారిస్తోంది. కుండపోత వర్షాలు భారీ విధ్వంసం సృష్టించాయి. మృతుల సంఖ్య పెరిగిపోతోంది.

ఇక కడప జిల్లాలో మృతుల సంఖ్య 40కి చేరింది. రాజంపేట మండలం పరిధిలోని పులపత్తూరు, మందపల్లి, గుడ్లూరులో 39 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 24 మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 24 మృతదేహాల్లో ఒకటి గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు వెల్లడించారు. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక రేపటి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడులో భారీగా వర్షాలు కురియనున్నాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

దెబ్బతిన్న రైల్వే ట్రాక్స్‌..

వర్షాల కారణంగా పలు చోట్ల రైల్వే ట్రాక్స్‌ దెబ్బతిన్నాయి. దీంతో పల రైళ్లను సైతం రద్దు చేసింది రైల్వే శాఖ. నేటి నుంచి చెన్నై సెంట్రల్‌-పీఎస్‌టీ ముంబై రైలును రద్దు చేశారు. ఎల్‌టీటీ ముంబై-చెన్నై సెంట్రల్‌ రైలు రద్దు అయ్యింది. అలాగే బిలాస్‌పూర్‌-తిరునల్వేలి రైలు కూడా రద్దు చేశారు. రేపు గోరఖ్‌పూర్‌-సికింద్రాబాద్‌ రైలు రద్దు అయ్యింది.

ఇవి కూడా చదవండి:

Indian Railway: 11 రైల్వే స్టేషన్‌ల అప్‌గ్రేడ్‌ పనులకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం..

1 Crore Cash Seized: వాహనాల తనిఖీ.. అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలు స్వాధీనం.. పోలీసుల అదుపులో ముగ్గురు