
ఎండలు, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఏపీ ప్రజలు, రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో.. వాటి ప్రభావం వల్ల వర్షాలు ఊపందుకున్నాయంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి, తేలికపాటి వర్షాలు, అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బుధవారం(జూన్ 21)న మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.. విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు తెలంగాణలోకి శుక్రవారం(జూన్ 22) నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బిపర్‌జాయ్ తుఫాన్ కారణంగా ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దులో నిలిచిపోయిన రుతుపవనాల కదలిక నెమ్మదిగా ప్రారంభమై.. ఏపీ వ్యాప్తంగా విస్తరించాయని.. ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల రేపటికి రాష్ట్రంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు ఈరోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు, రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
· విజయనగరం,విశాఖ, తిరుపతి,చిత్తూరు, అన్నమయ్య, YSR,సత్యసాయి,అనంతపురం,కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 20, 2023