నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది వాతావరణ శాఖ. దీంతో ఏపీ యానాం, ఉత్తరకోస్తాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారు.
తెలంగాణలో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ నగరంలో రాత్రి పూట తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..