Andhra Pradesh: ఏపీలో వచ్చే 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు.. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు హై అలెర్ట్

|

May 25, 2023 | 7:31 PM

ఎండలు తగ్గాయ్ అనకుంటున్నారా..? ఇకనుంచి వర్షాలు మొదలవుతాయని ఆశపడుతున్నారా..? ఆగడాగడండి.. చిన్న ఎండింగ్ టచ్ ఇవ్వనుంది సమ్మర్. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

Andhra Pradesh: ఏపీలో వచ్చే 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు.. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు హై అలెర్ట్
Andhra Weather
Follow us on

రాష్ట్రంలో రాబోవు మూడు రోజుల పాటు ఎక్కువుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు, శనివారం 130 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం.. అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, కర్నూలు,నంద్యాల, అనంతపురం, సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C – 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వివరించారు.

ఇక నైరుతి రుతుపవనాలు తదుపరి 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో పశ్చిమ / నైరుతి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం