Heat Wave: భానుడి ప్రతాపం.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేళల్లో అస్సలు బయటకు రాకండి..

|

Apr 04, 2024 | 9:02 AM

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Heat Wave: భానుడి ప్రతాపం.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేళల్లో అస్సలు బయటకు రాకండి..
Heat Wave
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 42 నుంచి 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు కూడ నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ పేర్కొంటోంది.

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే 130 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రేపు వడగాల్పులు వీచే మండలాలు(130): శ్రీకాకుళం 4 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4,
అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

బుధవారం వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో43.4°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే కడపజిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

కాగా.. తెలంగాణలో కూడా 42 నుంచి 43 డిగ్రీలపాటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర తెలిపింది.

ప్రజలకు సూచనలు..

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..