Andhra: పవన్ కళ్యాణ్ గారూ.! న్యాయం చేయండి.. మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ

మొదలుపెట్టి నెల గడుస్తుందని.. అయినా తనకు న్యాయం జరగలేదని హర్షవీణ చెబుతోంది. ఇంతకీ హర్ష వీణ కోరుతున్న న్యాయం ఏమిటి.? రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ గత నెల 27వ తేదీన రైల్వేకోడూరులోని.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra: పవన్ కళ్యాణ్ గారూ.! న్యాయం చేయండి.. మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ
Arava Sridhar Controversy

Edited By:

Updated on: Feb 26, 2026 | 8:46 PM

సంచలన వీడియోలు రిలీజ్ చేస్తూ.. కేరాఫ్ అడ్రస్‌గా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే బాధితురాలు హర్షవీణ మరో వీడియో రిలీజ్ చేసింది. ఈసారి అరవ శ్రీధర్‌ను, జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ హర్షవీణ కన్నీరు పెట్టింది. రేపటికి తను న్యాయం కోసం పోరాటం చేయడం మొదలుపెట్టి నెల గడుస్తుందని.. అయినా తనకు న్యాయం జరగలేదని హర్షవీణ చెబుతోంది. ఇంతకీ హర్ష వీణ కోరుతున్న న్యాయం ఏమిటి.? రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ గత నెల 27వ తేదీన రైల్వేకోడూరులోని పంచాయతీ కార్యాలయంలో పనిచేసే మహిళ హర్షవీణ న్యాయపోరాటం కోసం మీడియాను ఆశ్రయించింది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని హర్షవీణ ఈరోజు మరో వీడియో రిలీజ్ చేసింది. రేపటికి తన పోరాటానికి నెల రోజులు అవుతుందని కానీ జనసేన అధినేత, ఆ పార్టీ నేతలు తనకు న్యాయం చేయలేకపోయారని హర్షవీణ ఆ వీడియోలో పేర్కొంది.

విచారణ కమిటీ వేశారని అయితే ఆ కమిటీ ఏమి విచారించిందని ఆవిడ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనకు న్యాయం చేయడం లేదని అరవ శ్రీధర్ అనే వ్యక్తిని ఇప్పటివరకు ఆ పార్టీ అధినేత ఎందుకు ఏమి చేయలేదో అర్థం కావడం లేదని హర్ష వీణ అన్నారు. నేను ఇక్కడ మహిళగా పోరాటం చేస్తుంటే అరవ శ్రీధర్ ప్రశాంతంగా ఆయన ఊర్లో క్రికెట్ ఆడుకుంటున్నాడని.. ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తున్నా పట్టించుకోవడంలేదని హర్షవీణ అన్నారు. తనకు, తన కొడుకుకి ఇక చావే దిక్కని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని ఆవిడ డిమాండ్ చేశారు.

 

Follow Us