AP Half day schools : ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 1వ తరగతి నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సదరు ప్రకటనలో మంత్రి ఆదేశాలిచ్చారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం ఉంటుంది. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని కూడా మంత్రి తెలిపారు. ఎండలకు తోడు ఒకపక్క కరోనా కేసులు కూడా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షల నిర్వహణతో పాటు, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.