Andhra Pradesh: జిమ్‌కు షాకిచ్చిన కరెంట్ బిల్లు.. ఎంతొచ్చిందో తెలుసా?

Gym Owner: కరెంట్ బిల్లులు సాధారణంగా ఇళ్లకు ఒకలా, వ్యాపారాలకు మరోలా వస్తుంటాయి. ఎందుకంటే, పవర్ వాడకంతోపాటు ఫేజ్ మార్పులతో బిల్లులలో తేడాలు వస్తుంటాయి. అయితే, సాధారణ జనాలకు కోట్లల్లో బిల్లులు వస్తూ షాకిస్తున్న విషయాలు కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం. తాజాగా ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Andhra Pradesh: జిమ్‌కు షాకిచ్చిన కరెంట్ బిల్లు.. ఎంతొచ్చిందో తెలుసా?
Power Bill

Edited By:

Updated on: Jan 18, 2025 | 8:09 PM

Gym Owner: అదొక వ్యాయామశాల.. సాధారణ జిమ్.. నెల నెల వేలలో విద్యుత్ బిల్లు.. కానీ, ఈసారి వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే ఆ యజమానికి షాప్ కొట్టేంత పని అయింది. వేలు లక్షల కాదు ఏకంగా కోటికి పైనే.. మీకూ ఆశ్చర్యంగా ఉంది కదూ.. మీరే కాదు ఈ విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని పూడిమడక రహదారిలో ఓ జిమ్ నిర్వహిస్తున్నారు. ఆ జిమ్‌కు ప్రతి నెలా సాధారణంగా 18 నుంచి 20 వేలు బిల్లు వస్తుంది. కానీ, డిసెంబరు నెలకు సంబంధించి జనవరి నెలలో వచ్చిన బిల్లు ఒక్కసారిగా ఆందోళన కలిగించింది.

ఎందుకంటే.. నెలనెలా వచ్చే బిల్లుకు వెయ్యి, పది వెలు, లక్ష రూపాయల బిల్లు కాదండోయ్.. ఈ నెల బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే వచ్చింది. అంటే, అక్షరాలా 1,01,59,217 అంటే ( ఒక కోటి ఒక లక్ష యాభై తొమ్మిది వేల రెండు వందల పదిహేడు రూపాయలు ) వచ్చింది. దీంతో జిమ్ యజమాని కాండ్రేగుల జగన్నాథరావు షాక్ అయ్యాడు. అయితే అధికారులు స్పందించి టెక్నికల్‌గా పొరపాటు జరిగిందని వెంటనే సరి చేస్తామని కస్టమర్ జగన్‌కు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు సదరు యజమాని.

ఇదే కాదు, ఇంతకుముందు ఇలాంటి షాక్‌లు చాలానే ప్రజలకు తగిలాయి. ఈ క్రమంలో బిల్లులు కొట్టే ప్రక్రియను మరింత జాగ్రత్తగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే హార్ట్ ఎటాక్‌లు వస్తాయంటూ వాపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..