వైసీపీలో గురజాల సీటు పంచాయితీ.. టికెట్ ఇస్తే ఒక తలనొప్పి.. ఇవ్వకుంటే మరొకటి.!

ఆయన వైసీపీలో ఉంటే అక్కడ టికెట్‌ పంచాయితీ. టీడీపీలోకి జంపయితే అక్కడ కూడా సీటు ఫైటు షురూ అవడం గ్యారంటీ. ఈ పార్టీలో సీటు గడబిడ ఆ పార్టీకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. వాళ్లకు దబిడిదిబిడి అవుతుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరానేత?

వైసీపీలో గురజాల సీటు పంచాయితీ.. టికెట్ ఇస్తే ఒక తలనొప్పి.. ఇవ్వకుంటే మరొకటి.!
Ysrcp

Updated on: Jan 23, 2024 | 9:15 AM

ఆయన వైసీపీలో ఉంటే అక్కడ టికెట్‌ పంచాయితీ. టీడీపీలోకి జంపయితే అక్కడ కూడా సీటు ఫైటు షురూ అవడం గ్యారంటీ. ఈ పార్టీలో సీటు గడబిడ ఆ పార్టీకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. వాళ్లకు దబిడిదిబిడి అవుతుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరానేత?

గురజాల వైసీపీలో టికెట్‌ పంచాయితీ కొనసాగుతోంది. ఈసారి తనకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గట్టిగా పట్టు పడుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం ఆయన మొర ఆలకించట్లేదు. మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి…ఈసారి కూడా సీటు తనదే అంటున్నారు. కాసు వర్సెస్‌ జంగా.. ఎవరివైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుంది. వైసీపీలో గురజాల సీటు పంచాయితీ ఇప్పుడు హాట్‌హాట్‌గా మారింది.

ఇక తనకు అర్హత ఉంది కాబట్టే టికెట్‌ అడుగుతున్నానంటున్నారు వైసీపీ MLC జంగా. అధిష్ఠానం రియాక్షన్‌ని బట్టి తన కార్యాచరణ ఉంటుందంటున్నారు. దీనికితోడు ఆయన ఈ మధ్యే వైసీపీని వీడిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని కలిసి చర్చలు జరపడం వైసీపీ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించిందంటున్నారు. ఈ నేపథ్యంలో తనది ఆత్మగౌరవ పోరాటమని ఆ నాయకుడు అంటుంటే.. తమ నాయకుడికి అవమానం జరిగితే తమకు జరిగినట్లేనంటోంది ఆయన సామాజికవర్గం. ఎమ్మెల్సీ విన్నపాన్ని వైసీపీ నాయకత్వం మన్నిస్తుందా? టికెట్‌ దక్కకుంటే ఆయన గోడ దూకేస్తారా? పల్నాడులో BC నేత రాజకీయం ఏ టర్న్‌ తీసుకోబోతోంది అంటే దీనిలో ఇంకా బోలెడు ట్విస్టులు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

మరోవైపు జంగాకు మద్దతుగా బీసీ సంఘం నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. జంగా కృష్ణమూర్తికి సంఘీభావం తెలియజేస్తున్నామంటున్నారు బీసీ సంఘాల నేతలు. ఒక్కసారి పోటీ చేసి గెలిచిన వ్యక్తి గురజాలలోనే స్థిరపడిపోతానని అంటున్నారంటూ కాసు మహేష్‌ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. అటువంటి వారి పీఠాలు కూలిపోయేదాకా పని చేస్తామని, అధికార పార్టీ జంగాకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాం‌మంటున్నారు బీసీ సంఘాల నేతలు. ఇక తనకు ఆత్మ గౌరవం ముఖ్యం అంటున్నారు జంగా కృష్ణమూర్తి. ఆత్మ గౌరవం కోసం పోటీ చేస్తా, సీటు కోసం పోటీ చేస్తా అంటున్నారు ఆయన. వైసీపీలో యాదవులకు అన్యాయం జరిగిందని తాను అనలేదంటున్నారు జంగా. తనకు అధికార పార్టీ అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నానని, టికెట్ ఇవ్వకపోతే బీసీ నేతలతో సమాలోచనల తర్వాత కార్యాచరణ ఉంటుందంటున్నారు.

గురజాల సీటు కోరుకుంటున్నా. రాకుంటే కార్యాచరణ ప్రకటిస్తా. ఇదీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఇస్తున్న అల్టిమేటం. అధికార పార్టీ అసెంబ్లీ టికెట్‌ ఇవ్వకపోతే జంగా సైకిల్‌ ఎక్కుతారా? ఎక్కితే అప్పుడేం జరుగుతుంది. ఇప్పటిదాకా సీటు కోసం ఆయన చేస్తున్న ఫైటుతో గురజాల వైసీపీలో గడబిడ నెలకొంది. ఇప్పుడు టికెట్‌ రానిపక్షంలో జంగా టీడీపీలో చేరితే.. వైసీపీ పంచాయితీ టీడీపీకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని, గురజాల టికెట్‌ తనదే అంటున్నారు. ఎంతోకాలంగా ఆయన అక్కడ పనిచేస్తున్నారు. జంగా కృష్ణమూర్తి.. టీడీపీలో చేరితే టికెట్‌ కోసం యరపతినేనితో ఆయనకు ఫైట్‌ మొదలవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ తలనొప్పి కాస్తా టీడీపీకి చుట్టుకుంటుంది. ఒకవేళ జంగాకు టీడీపీ టికెట్‌ ఇస్తే యరపతినేని ఊరుకుంటారా? ఆయన పరిస్థితి ఏంటి? జంగా టికెట్‌ గడబిడ వైసీపీనే కాదు టీడీపీని కూడా పరేషాన్‌ చేస్తోందంటున్నారు.