ఏపీలో సెల్ఫీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. అయితే ఓ డాక్టర్ సెల్ఫీ ఛాలెంజ్ పొలిటికల్ హీట్ పుట్టించింది.
డాక్టర్ వీడియో రెండు పార్టీల్లో కలకలం రేపుతోంది. ఆయన సవాల్ ఎవరికన్నది చర్చకు దారి తీసింది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు సెల్ఫీ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. అధికార, విపక్ష పార్టీల నేతలు ఇప్పుడు పోటీపడి సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళలో ఈ సెల్ఫీ ల ఛాలెంజ్ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్… రియల్ సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోపై పల్నాడు రాజకీయ వర్గాల్లో చర్చినీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ని ప్రోత్సహించింది ఎవరు..? కేసులు పెట్టింది ఎవరి మీదా..? పేరొందిన లైం సిటీని దిక్కుతోచని స్థితిలో పడేసింది ఎవరు..?
ప్రస్తుత మైనింగ్ పై ఆంక్షలు పెడుతున్నది ఎవరు..? పర్మిషన్స్‌కి మించి మైనింగ్ చేసింది ఎవరు..? అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని పిల్లలను పొట్టన పెట్టుకుంది ఎవరు..? ఇప్పటివరకు మేము అక్రమ మైనింగ్ చేయలేదని చెప్పే ధైర్యం ఏ నాయకునికైనా వుందా..? వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఎవరి వ్యాపారం జోలికి మేము పోము అని చెప్పే సత్తా ఏ నాయకునికైనా వుందా..? మాకుంది.. మేము చెప్తాం.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏ వ్యాపారి జోలు మేము పోము.. నా సవాల్ ని ఏ నాయకుడైనా స్వీకరిస్తే.. ఇలానే సెల్ఫీ వీడియో తీయాలంటూ డాక్టర్ అశోక్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. టీడీపీ యరపతినేని, వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ నేతలిద్థరికీ సవాల్ విసిరి తాము మూడో ప్రత్యామ్నాయం అనే విధంగా ఉండటంతో చర్చనీయాంశంగా మారింది.
Reporter: T. Nagaraju
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..