Guntur GGH: “పోకిరి” సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్ర చికిత్స.. సర్కారు దవాఖాన వైద్యుల అద్భుతం

| Edited By: Balaraju Goud

Feb 04, 2024 | 1:47 PM

గుంటూరు జనరల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. పెషెంట్‌కు ఇష్టమైన సినిమా చూపిస్తూ.. బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ప్రైవేటు ఆసుపత్రులకు పరమితమైన అత్యాధునికి చికిత్సలు ప్రభుత్వాసుపత్రిల్లో విజయవంతంగా పూర్తి చేస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ వైద్యరంగంలో తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్‌ చేశారు గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు.

Guntur GGH: పోకిరి సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్ర చికిత్స.. సర్కారు దవాఖాన వైద్యుల అద్భుతం
Ggh Awake Brain Surgery
Follow us on

గుంటూరు జనరల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. పెషెంట్‌కు ఇష్టమైన సినిమా చూపిస్తూ.. బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ప్రైవేటు ఆసుపత్రులకు పరమితమైన అత్యాధునికి చికిత్సలు ప్రభుత్వాసుపత్రిల్లో విజయవంతంగా పూర్తి చేస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ వైద్యరంగంలో తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్‌ చేశారు గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురంనకు చెందిన పండు అనారోగ్యానికి గురయ్యాడు. జనవరి రెండో తేదిన అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబసభ్యులు. అప్పటికే కుడిచేయి, కాలు చచ్చు పడిపోయాయి. దీంతో వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకుని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మెదడులోని ఎడమ భాగంలో ఉండే మోటార్ కార్టెక్స్‌లో కణితి ఉందని నిర్ధారించారు. దీని కారణంగానే కాలు చేయి చచ్చుబడినట్లు రోగి బంధువులకు తెలిపారు వైద్యులు.

అయితే రోగికి శస్త్ర చికిత్స చేసి కణితి తొలగించాలని వైద్యులు సూచించారు. మెదడులోని సున్నితమైన భాగం కావడంతో రోగి మెలుకువగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఆపరేషన్ జరిగే సమయంలో ప్రాణానికే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్యులు రోగి బంధువులకు తెలిపారు. అయినప్పటికీ శస్త్ర చికిత్స చేయాలని బంధువులు వైద్యులకు తెలిపారు. దీంతో వైద్యులు రోగికి సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో రోగికి ఇష్టమైన హీరో మహేష్ బాబు అని తెలుసుకుని, అందులో పండుకి ఇష్టమైన పోకిరి సినిమా వేసి అతను చూస్తుండగా ఆపరేషన్ చేయడం మొదలు పెట్టారు.

వైద్యులు రోగితో మాట్లాడుతూ డాక్టర్లు చెప్పిన విధంగా కాలు చేయి కదుపుతుండగా మెదడులోని సున్నితమైన భాగాలకు దెబ్బ తగలకుండా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి, పెంచలయ్య చెప్పారు. దీన్ని అవేక్ సర్జరీ అని వైద్య పరిభాషలో అంటున్నారని మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి సమస్య రాకుండా ఇలాంటి శస్త్ర చికిత్స చేస్తుంటారని తెలిపారు. అపరేషన్ పూర్తైన తర్వాత రోగి పూర్తిగా కోలుకోవడంతో పండును ఢిశ్చార్జ్ చేశారు. కాలు చేయి వీక్ నెస్ తగ్గి, రోగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

ఈ తరహా ఆపరేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగలేదని మొదటిసారి గుంటూరులో చేశారని సూపరింటిండెంట్ కిరణ్ చెప్పారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులను ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేస్తున్నారని కలెక్టర్ వేణుగోపాల రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల సెక్రటరీ క్రిష్ణ బాబు అన్నారు. ఆసుపత్రి వర్గాలను ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…