Guntur: కొందరు తల్లిదండ్రులకు కన్న కొడుకులే శాపంగా మారుతున్నారు. వృద్ధులుగా మారిన దంపతుల అలనా పాలనా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే వారికి శాతంగా మారుతుండటం కలచివేస్తోంది. వృద్ధ దంపతులను అక్కున చేర్చుకోవాల్సిన కుటుంబసభ్యులే వారిని గుడి ముందు వదిలి వెళ్లారు. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కొడుకులే పెద్దయ్యాక తల్లిదండ్రులను సైతం పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులను ఎంతో మంది కొడుకులు అనాథ ఆశ్రమంలో చేర్పిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ఆస్తులను లాక్కొని వారిని రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి అమానుష ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను గుడి ఎదుట సామాన్లతో సహా విడిచి వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే వీరిని చూసిన స్థానికులు వారిని అక్కున చేర్చుకున్నారు.
బద్దూరి వెంకట సుబ్బారెడ్డి,(74 )సీతారావమ్మ (70) వృద్ధ దంపతులు తమది చిలకలూరిపేటగా చెబుతున్నారు. ఇలా వృద్ధ దంపతులను గుడి ఎదుట విడిచిపెట్టి వెళ్లడంతో స్పందించిన స్థానికులు.. వారికి ఆహారం అందిస్తున్నారు. ఇటీవల చిలకలూరిపేటలో ఉన్న తమ ఇంటిని 30 లక్షలకు కొడుకు పేరిరెడ్డి అమ్మేశాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వృద్ధ దంపతులను అనాథశరణాలయానికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: