Attendance: గవర్నమెంట్ టీచర్స్ కు అలర్ట్.. యాప్ ద్వారా హాజరు రేపటి నుంచే.. ఆర్డర్స్ జారీ

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:11 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు కీలక అప్ డేట్.. రేపటి (సెప్టెంబర్ 1) నుంచి యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా యాప్‌లో హాజరు వేయాలని...

Attendance: గవర్నమెంట్ టీచర్స్ కు అలర్ట్.. యాప్ ద్వారా హాజరు రేపటి నుంచే.. ఆర్డర్స్ జారీ
Andhra Pradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు కీలక అప్ డేట్.. రేపటి (సెప్టెంబర్ 1) నుంచి యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా యాప్‌లో హాజరు వేయాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, అధికారులు ఈ యాప్ ద్వారానే (App Attendence) అటెండెన్స్ వేయాలని, ఆగస్టు 31లోపు అందరూ యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఆదేశాల్లో వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో దాదాపు రెండు లక్షల వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. టీచర్ల అటెండెన్స్ తో పాటు, స్టూడెంట్స్ హాజరనూ ఈ యాప్ లోనే వేయాలన్న అధికారుల ఆదేశాలతో చాలా వరకు ఉపాధ్యాయులు (Govt Teachers in AP) యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే అందరూ ఉదయం ఒకేసారి హాజరు వేస్తుంటే సర్వర్‌ సమస్య ఏర్పడుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అందరూ ఒకే సమయంలో అటెండెన్స్ వేయడం వల్ల సర్వర్ పై ఒత్తిడి పడి సాంకేతిక సమస్య నెలకొంటుందని ఫిర్యాదులు చేస్తున్నారు. సిగ్నల్ సరిగా లేని ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, దూరంగా విసిరేసినట్టుండే గ్రామాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులు అధికంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. హాజరు పడకపోతే జీతం కట్‌ చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డివైజ్‌లు ఇస్తే తప్పకుండా హాజరు నమోదు చేస్తామని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే.. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేని టీచర్లు, ఉద్యోగులు తమ అటెండెన్స్ ను హెడ్మాస్టర్‌ లేదా ఇతర ఉపాధ్యాయుల ఫోన్ల ద్వారా వేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ ఆగస్టు 31 (బుధవారం) వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, గడువు పెంచేది లేదని ఆదేశాల్లో స్పష్టం చేసింది. విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, జోన్, ఎంఈవో, జిల్లా కార్యాలయాలు, డైట్స్ వంటి కార్యాలయాలకూ ఈ విధానం వర్తిస్తుందని తెలిపింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చూడాలని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్లు, డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి