AP Veterinary Jobs: రాష్ట్రంలో భర్తీ చేయతలపెట్టిన ‘వెటర్నరీ’ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ పోస్టుల నియామకాలకు సంబంధించిన నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. మునుపలి నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఆ మేరకు బుధవారం మరో ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి పశు వ్యాధు నిర్ధారణ ప్రయోగశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏపీసీవోఎస్ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ఆధారంగా.. డీఎంఎల్‌టీలో మార్కుల ఆధారంగా ల్యాబ్ టెక్నీషియన్లను, పదో తరగతి మార్కుల ఆధారంగా ల్యాబ్ అటెండర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Also read: