Andhra pradesh: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు.. కానీ కండిషన్స్‌ అప్లై..

|

Feb 15, 2022 | 3:40 PM

Andhra pradesh: తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేసినా కొన్ని నిబంధనలు మాత్రం ఇంకా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.

Andhra pradesh: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు.. కానీ కండిషన్స్‌ అప్లై..
Andrapradesh
Follow us on

Andhra pradesh: కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. థార్డ్‌ వేవ్‌ రూపంలో మరోసారి కరోనా (Corona) విచురుకుపడుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా భారీగా పెరిగింది. ఒకానొక సమయంలో మూడు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కేసులు ఒకేసారి భారీగా తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తక్కువ సమయంలో సాధారణ పరిస్థితిలు వచ్చాయి. దీంతో ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేసినా కొన్ని నిబంధనలు మాత్రం ఇంకా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మార్కెట్‌, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. దుకాణ యజమానులు తమ సంస్థల్లోకి మాస్కు లేకుండా వచ్చేవారిని అనుమతిస్తే రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రోడ్లపై మాస్కులు లేకుండా తిరిగే వారికి రూ. 100 పెనాల్టి విధించనున్నారు.

ఇదిలా ఉంటే కరోనా థార్డ్‌ వేవ్‌ దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం జనవరి 18 నుంచి 31 వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జనవరి చివరి నాటికి కూడా కరోనా కేసులు తగ్గకపోవడంతో కర్ఫ్యూని ఫిబ్రవరి 14 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నైట్‌ కర్ఫ్యూని పూర్తిగా ఎత్తివేస్తూ ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Indian Rail Jobs: నిరుద్యోగులకు అలర్ట్‌! భారత రైల్వేలో 2, 65,000లకు పైగా ఉద్యోగావకాశాలు.. త్వరలో..

Coconut Dosa: కొబ్బరి దోశ రుచి చూస్తే ఫిదా కావాల్సిందే.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?

Coconut Dosa: కొబ్బరి దోశ రుచి చూస్తే ఫిదా కావాల్సిందే.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?