అమెరికాలోని అట్లాంటాలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారికి.. వేమూరు నుండి బ్రహ్మకమలాలు…

| Edited By: Jyothi Gadda

Dec 05, 2024 | 4:38 PM

ఇందులో భాగంగానే అమెరికాలోని అట్లాంటాలో మహాలక్ష్మీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అట్లాంటాలో వెలసిన అమ్మవారికి బాపట్ల జిల్లా నుంచి బ్రహ్మకమలాలు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని అట్లాంటాలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారికి..  వేమూరు నుండి బ్రహ్మకమలాలు...
Brahmakamalam
Follow us on

గత కొంతకాలంగా విదేశాల్లో హిందూ దేవాలయాల నిర్మాణాలు శర వేగంగా జరుగుతున్నాయి. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ మన దేవుళ్లు, గుళ్లు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. అమెరికాలోనే వివిధ రాష్ట్రాల్లోనూ మన సంస్కృతీ, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆలయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాలోని అట్లాంటాలో మహాలక్ష్మీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అట్లాంటాలో వెలసిన అమ్మవారికి బాపట్ల జిల్లా నుంచి బ్రహ్మకమలాలు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని అట్లాంటాలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చేసేందుకు బంగారు కమలం పూలు కావాలని దేవస్థానం ట్రస్ట్ నిర్ణయించింది. అయితే, వాటిని ఎక్కడ చేయించాలనే ఆలోచన వచ్చినప్పుడు బాపట్ల జిల్లా వేమూరులోని శిల్పుల చేత చేయిస్తే బాగుంటుందని అక్కడి వారు సలహా ఇచ్చారు. దీంతో దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు వేమూరులోని దేవమయాచార్య, నాగమయ్య నారాయణ శిల్పులు నిర్వహిస్తున్న సత్య శిల్పశాలకు వచ్చారు. 108 బ్రహ్మ కమలాలు తయారు చేయాలని ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఇద్దరూ అత్యంత్య సుందరంగా 108 బ్రహ్మకమలాలను తయారు చేసి అట్లాంటా పంపించారు.

ఒక్కోక్క పువ్వు 33 గ్రాముల చొప్పున మూడు కిలోల ఆరువందల గ్రాముల బంగారంతో 108 కమలం పువ్వులను తయారు చేశారు. ఇందుకోసం రెండు కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల సలహా మేరకు వాటిని అట్లాంటా పంపించారు. దేవాలయాల్లో బంగారు ఆభరణాలతో పాటు శిల్పాలను చెక్కడానికి అనేక శిల్ప శాలలు, ఎంతో కళనైపుణ్యం కలిగిన శిల్పకాళాకారులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నారు. వివిధ దేశాలకు ఇక్కడ నుండే ఆభరణాలను తయారు చేసి పంపిస్తుంటారు. తెనాలి అక్కల బ్రదర్స్ కూడా బంగారు ఆభరణాల తయారీలో ఎంతో ప్రసిద్ది చెందారు. ఇందులో భాగంగానే సత్య శిల్పశాల మరోసారి అమ్మవారి బంగారు కమలాలను అత్యంత్య సుందరంగా చేసి ఈ ప్రాంతం పేరును సార్ధకం చేసుకున్నారని పలువురు అభినందనలు కురపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..