Pulasa Fish: అన్నోయ్.. చిక్కింది మరో పులస – వేలంలో ఎంత పలికిందో తెలుసా..?

ఉభయ గోదావరి జిల్లాలో ఓ పులస చేప దొరికిందంటే ఊరంతా హడావుడే ఉంటుంది. ఎంత పలికింది..? ఎవరు కొన్నారు అని తెగ మాట్లాడుకుంటారు. ఇది యానాం మార్కెట్‌కు వచ్చిన మూడో పులస అని చెబుతున్నారు. “పుస్తెలమ్మైనా పులస కొని తినాల్సిందే” అని నానుడి కూడా ఉన్న విషయం తెలిసిందే.

Pulasa Fish: అన్నోయ్.. చిక్కింది మరో పులస - వేలంలో ఎంత పలికిందో తెలుసా..?
Pulasa Fish

Updated on: Jul 19, 2025 | 7:18 PM

వర్షాకాలం వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో పులసల హంగామా మాములుగా ఉండదు. అరుదుగా దొరికే పులసలను దక్కించుకునేందుకు మాంసం ప్రియులు పోటీ పడతారు. తాజాగా గోదావరిలో పడిన ఓ పులస చేప… యానాం మార్కెట్ వేలం పాటలో రూ.12 వేలకు అమ్ముడైంది. ‘‘పుస్తెలమ్మైనా పులస కొని తినాల్సిందే’’ అనేది గోదావరి వాసుల నానుడి. పులస అంటే పులకింతే… కానీ ఇప్పుడు అది దొరకడం అంత ఈజీ కాదు. జులై నుంచి అక్టోబర్‌ వరకు సముద్రం నుంచి గోదావరిలోకి తల్లి పులసలు వస్తూ… గుడ్లు పెట్టి తిరిగి వెళ్లే క్రమంలో వేటలో పడతాయి.

గతంలో గోదావరిలో పులసలు దండిగా దొరికేవి.. కానీ ఇప్పుడు వాటి లభ్యత చాలా తగ్గిపోయింది. దీంతో కొందరు పులస ప్రియులు.. ముందుగానే ఆ చేపల కోసం అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు. పులస వస్తే ముందుగా నాకే ఇవ్వండి వారిని కోరుతున్నారు. పలు మండలాలలోని వ్యాపారులు, నేతలు, బడా వ్యక్తులు ఇలా బుకింగులతో బిజీగా ఉన్నారు. పులసను తమకు కావాల్సినవారికి గిఫ్ట్‌లా పంపిస్తూ పలువురు తమ రేంజ్‌ను చాటుకుంటున్నారు!

గత కొన్ని సంవత్సరాలుగా పులసల సంఖ్య తగ్గుతూ వస్తోంది. సముద్ర కాలుష్యం, అధిక వలల వేట వల్ల పులసల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. మత్స్యశాఖ అధికారులు దీనిపై జాలర్లలో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.