Fire Accident in Kakinada: తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణం కాకినాడ లో ఘోర ప్రమాదం జరిగింది. కాకినాడ సముద్రతీరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి… దట్టమైన పొగ వ్యాపించింది. వెల్గింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో మంటలు అందుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎంత మేరకు ఆస్థి నష్టం జరిగింది.. తదితర విషయాలు తెలియాల్సి ఉంది.